Begin typing your search above and press return to search.
అమ్మ బర్త్ డే.. అంత భారీ సభ పెడతారట
By: Tupaki Desk | 2 Jun 2017 8:44 AM GMTసార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల టైం ఉన్నప్పటికి.. అటు తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్.. ఇటు ప్రధాన ప్రతపక్షమైన కాంగ్రెస్.. బీజేపీలు మహా హుషారుగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాకిచ్చే.. అధికారాన్ని తాము చేజిక్కించుకుంటాయని చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సంక్షేమ కార్యక్రమాలతో అధికారపక్షం మోత పుట్టిస్తోంది. అదే సమయంలో తమపై చేసే విమర్శల్ని బలంగా తిప్పి కొడుతోంది. అంతేకాదు.. తమకు విపక్షాలు పోటీనే ఇవ్వలేవంటూ తేల్చి చెబుతోంది. తాము చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరెవరూ ఇంతకు ముందు చేయలేదని చెబుతూ.. ఓట్లను అడిగే అర్హత తమకు మాత్రమే ఉందన్నట్లుగా వ్యవహరిస్తోంది టీఆర్ఎస్.
ఇదిలా ఉంటే.. గులాబీ నేతలు చెప్పేందంతా మాటలే కానీ చేతలు ఎంతమాత్రం కాదని చెబుతున్నాయి తెలంగాణ విపక్షాలు. ఏదో అద్భుతం జరిగిపోతున్నట్లు చెప్పినప్పటకీ.. అలాంటిదేమీ చేయటం లేదంటూ మండిపడుతున్నాయి విపక్షాలు.
ఇందుకు తగ్గట్లే మొన్నటికి మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణలో పర్యటించి.. తెలంగాణ సర్కారు తీరును దుమ్మ దులిపేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నిప్పులు చెరగటాన్ని మర్చిపోలేం.
ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని సూటిగా ప్రశ్నించారు. అంతేనా.. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. దాని ప్రయోజనాల్ని నలుగురు కుటుంబ సభ్యులే పంచుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఇలా కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసిన రాహుల్ గాంధీ మాటలు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజా సభ అనుకున్న దాని కంటే భారీ సక్సెస్ కావటంతో కాంగ్రెస్ నేతల్లో సంతోషం పెరిగింది.
ఇదే ఊపులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ను ఆయన అసెంబ్లీ స్థానంలోనే ఓడిస్తానని చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి.. ఈ ఏడాది డిసెంబరు 9న సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పది లక్షల మందితో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆ సభతో కేసీఆర్ సర్కారుపై తీవ్రస్తాయిలో విరుచుకుపడటం ఖాయమంటున్నారు. మిలియన్ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్న ఈ సభను ఆర్నెల్ల ముందే చెప్పేయటం చూస్తే.. అధికారపక్షంపై విపక్ష పోరాటం రానున్న రోజుల్లో మరింత జోరుగా సాగటం ఖాయమన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/