Begin typing your search above and press return to search.

2019లో టీఆర్ ఎస్‌ కు 5 సీట్లేన‌ట‌

By:  Tupaki Desk   |   21 Dec 2016 10:30 PM GMT
2019లో టీఆర్ ఎస్‌ కు 5 సీట్లేన‌ట‌
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌లకు పెట్టింది పేరు అన్న‌ట్లుగా ఉండే సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు - సీఎల్పీ ఉప‌నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మ‌రోమారు అదే రీతిలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో త‌న‌ను క‌లిసిన మీడియా మిత్రుల‌తో పిచ్చాపాటీగా ముచ్చ‌టిస్తూ....2019 ఎన్నిక‌ల గురించి జోస్యం చెప్పారు. ఆ ఎన్నిక‌ల్లో తెరాస 5 సీట్లకే పరిమితం అవుతుంద‌ని జోస్యం చెప్పారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు - ఈటెల రాజేంద‌ర్ తో పాటు మరో ముగ్గురు తప్ప ఎవరు గెలువరని కోమ‌టిరెడ్డి విశ్లేషించారు. టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గెలుపు కష్టమేన‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న నాలుక మీద మచ్చ ఉంద‌ని పేర్కొంటూ....తాను అన్నది నిజం అవుతుందని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.

మంత్రి హరీష్ రావు తెలంగాణ పోరాట యోధుడు అని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల జ‌ల్లులో ముంచెత్తారు. అందుకే ఆయ‌న‌కు ఎప్పుడైన విజ‌యం సాధ్య‌మ‌ని అన్నారు. తెలంగాణ అంటే తన్నుడే అన్న ప్ర‌స్తుత టీడీపీ నేత తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని విశ్లేషించారు. పార్టీ మారిన వాళ్ళను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2011లో తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడే మిగతా తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలంగాణ అప్పుడే వచ్చేద‌ని జోస్యం చెప్పారు. 100 సీట్లు - 15 పార్లమెంట్ సీటు గెలిచేవాళ్ళమ‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. తెరాస అడ్రస్ లేకుండ పోయేదని, . ఆలస్యం జరగడం వల్లే నష్టపోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని త‌మ నాయ‌కుడుగా ఉన్న‌ జానారెడ్డికి చెప్పినప్ప‌టికీ త‌న వ్యూహాన్ని పట్టించుకోలేదని కోమ‌టిరెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజీనామాలతో తెలంగాణా వస్తుందా అని జానారెడ్డి అన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేప‌ట్టిన సీపీఎం నేత తమ్మినేని వీర‌భ‌ద్రం గురించి ప్ర‌స్తావిస్తూ..ఆయ‌న‌ పాదయాత్ర చేస్తున్నట్టు లేదని అన్నారు. అందుకే త్వరలోనే రాష్ట్రమంతా మోటార్ సైకిల్ యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగటానికి పార్టీ నుంచి ఎవరి అనుమతి అవసరం లేదని త‌న యాత్ర గురించి కోమ‌టిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/