Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కొంప‌లో కోమ‌టిరెడ్డి కుంప‌టి

By:  Tupaki Desk   |   6 Feb 2018 11:11 AM GMT
సీఎం కేసీఆర్ కొంప‌లో కోమ‌టిరెడ్డి కుంప‌టి
X
తెలంగాణ‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో మ‌న‌స్ప‌ర్ధ‌లున్నాయ‌ని సూచించారు. గ‌తంలో కాంగ్రెస్ నేత‌లు కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట.

ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట. కొడుకు - కూతురు -మేనల్లుడు హరీష్ రావు నుంచి కేసీఆర్ కు పదవీ గండం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నా... కేటీఆర్ - కవితకి అంత సీన్ లేదంటున్నారు. కేసీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన నేత హరీష్ రావు మాత్రమేనని - మామకు ఉన్నట్లే అల్లుడుకి కూడా అన్నివర్గాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉందని - పైగా ఎమ్మెల్యేల్లోనూ అతనంటే మక్కువ ఉందంటున్నారు.అందుకే కేసీఆర్ తన జాగ్రత్తల్లో తానుంటున్నారని టీకాంగ్ నేతలు ఆరోపించారు.

ఇప్ప‌డు అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి చేయ‌డం మ‌రోసారి కేసీఆర్ ఫ్యామిలీ వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. టీఆర్ ఎస్ పార్టీ స్వింగ్ లో ఉందంటే దానికి కార‌ణం మంత్రి హ‌రీష్ రావేన‌ని గుర్తు చేశారు. మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల మంత్రి హ‌రీష్ రావు ఇంట్లో జ‌రిగిన ఫంక్ష‌న్ కు కేటీఆర్ హాజ‌రు కాలేద‌న్నారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ సినిమా చూసేందుకు బెంగ‌ళూరు వెళ్లార‌ని ఆరోపించారు. కేసీఆర్ లేకపోతే బావా - బావమరుదులు ఆధిప‌త్యం కోసం రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.

త‌న అనుచ‌రుడు నల్లగొండ మున్సిపల్‌ చైర్‌ పర్సన్ ల‌క్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. హ‌త్య‌కేసు లో కాల్ డేటా టైప్ చేసుకొచ్చామ‌ని మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. ఆ మంత్రికి ఏం తెలుసు.మ‌రో ఆరునెల‌ల్లో అడ్ర‌స్ గల్లంతు అవుతుంది. దీంతో మ‌ళ్లీ ఆయ‌న చీఫ్ లిక్కర్ అమ్ముకోనున్నారని అన్నారు. ప‌లు హ‌త్య‌కేసుల్లో జ‌గ‌దీష్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అని ప్ర‌శ్నించారు. అంతేకాదు కాల్ డేటాపై ఆయ‌న అవ‌గాహ‌నా రాహిత్యం కొట్టొచ్చిన‌ట్లు క‌న‌బ‌డుతోందని ఎద్దేవా చేశారు.