Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇలాకాలో సంచ‌ల‌న కామెంట్ చేసిన కోమ‌టిరెడ్డి

By:  Tupaki Desk   |   25 Feb 2018 2:55 PM GMT
కేసీఆర్ ఇలాకాలో సంచ‌ల‌న కామెంట్ చేసిన కోమ‌టిరెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - సీఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై విరుచుకుప‌డుతున్న కోమ‌టిరెడ్డి తాజాగా ఆయ‌న సొంత ఇలాకాకు వెళ్లి మ‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకా అయిన సిద్ధిపేట‌లోనే..కేసీఆర్‌ కు కాక‌పుట్టించే కామెంట్లు చేశారు. సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలం మైలారం గ్రామంలో భాస్కర్ గౌడ్ అనే గీత కార్మికుడు కొద్దిరోజుల క్రితం ఈత చెట్టుపై నుండి పడ్డారు. వెన్నెముక విరిగి మంచానికి పరిమితమైన భాస్కర్ గౌడ్‌ ను కోమ‌టిరెడ్డి ప‌రామ‌ర్శించారు. భాస్కర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి అనంత‌రం లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు. అనంత‌రం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పి ఆ నిధులను దోచుకుతింటున్న కేసీఆర్ కుటుంబం వృద్ధులకు రెండు నెలల నుండి పెన్షన్లు ఇవ్వడంలో విఫలం చెందింద‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు - మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ కోట్లు సంపాదించాడని దుయ్య‌బ‌ట్టారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం కక్కుర్తి పడుతోంద‌ని విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఎస్సై శ్రీశైలం ప్రవర్తన మార్చుకోవాలని సూచించిన కోమ‌టిరెడ్డి....అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సంగతి తేలుస్తామ‌ని హెచ్చ‌రించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బూట‌క‌మ‌ని కోమ‌ట‌రెడ్డి మండిప‌డ్డారు. ఆయ‌న తీర్చిదిద్దినవి రైతు సమన్వయ కమిటీలు కావు రాక్షస సమితులని విరుచుకుప‌డ్డారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమ‌ని - టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ ఓడిపోవ‌డం త‌ప్ప‌ద‌ని కోమ‌టిరెడ్డి జోస్యం చెప్పారు.