Begin typing your search above and press return to search.
ఇదేమి లాజిక్ సారూ : రెడ్లంతా బాగుపడినట్లేనా...?
By: Tupaki Desk | 1 July 2022 10:30 AM GMTకాగితం మీద పంచదార అని రాసి దాని నాలుకతో తాకితే తీపి వస్తుందా. అలాగే ఏదైనా ఎవరికి వారు స్వీయ అనుభవంతోనే సాధించాలి. ఎవరో ఫలానా వారు తమ కులపోడు ఉన్నత పదవిలో ఉన్నారు అంటే ఆ కులం అంతా బాగు పడిపోయినట్లేనా. ఇది ఇప్పటికి మూడు దశాబ్దాల మునుపు అయితే జనాలలో ఉన్న నిరక్షరాస్యత, మూఢ నమ్మకాల వల్ల తెలియని తనం వల్ల అనుకుంటే సరిపోయిందేమో. ఇపుడు ఎవరికి వారు తమకేంటని ఆలోచిస్తున్న కాలం. లక్షల్లో ఉన్న సామాజిక వర్గాల నుంచి ఏ ఒకరిద్దరినో అందలాలు ఎక్కించి మీరంతా పండుగ చేసుకోండి అంటే వారు చూస్తూ ఊరుకుంటారా.
కానీ శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాత్రం ఇంకా పాతకాలం మాటలు క్రీస్తు పూర్వం నాటి నాటి మాటలే మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యారూ అంటే రెడ్లదే కదా అధికారం అని లాజిక్ కి అందని మాటలేవో మాట్లాడారు. పోనీ సరేననుకున్నా అది అలా ఎలా జరుగుతుంది కోన సారూ అని అంతా అంటున్నారు.
నిజమే జగన్ సీఎం గా ఉన్నారు. కానీ రెడ్లు అంతా తమదే అధికారం అని ఎందుకు సంతోషపడాలి. ఎందుకు ఎగిరి గంతేయాలి అని వారు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. తమకు పదవులు రాలేదని రెడ్లు బాధపడవద్దు జగన్ని ముఖ్యమంత్రిగా చూసుకుని ఫుల్ హ్యాపీస్ అవాలని కోన రఘుపతి చెబుతున్న సుద్దులు మాత్రం రెడ్డి వర్గాన్ని మండించేస్తున్నాయట.
నిజానికి ఇలాంటి కామెంట్స్ వల్ల ఆ సామాజిక వర్గం కూడా ఇబ్బందులలో పడుతుంది. అందరు రెడ్లూ కూడా జగన్ కి ఓటేసి ఉండరు. వారికి కూడా విభిన్న రాజకీయ దృక్పధం ఉంటుంది. అలాగే రెడ్లు ఎవరైనా తమకు తాముగా బాగుపడాలని ఆశించే వారే ఎక్కువ. ఎవరో పేరు చెప్పుకుని తాము డాబు చేయాలని అనుకునే వారు పెద్దగా ఉండరు. ఇక సమాజంలో కూడా అందరూ ఒకటి అనుకున్న చోట ఇలాంటి వింత ప్రకటనలు వ్యాఖ్యలు చికాకు పెడతాయి.
మీకేంటి మీ వాడే సీఎం కదా అని ఇతర వర్గాలు గుచ్చుతున్నపుడు చెప్పుకోలేక మానలేక పడే అవస్థ కూడా వేరేగా ఉంటుంది. అయినా కులం అన్నది సున్నితమైన అంశం. దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడమే తప్పు అనుకుంటే జగన్ సీఎం కాబట్టి మీరంతా సీఎం గానే ఫీల్ అవండి అంటూ చేసే ప్రకటనలు తప్పుడు అర్ధాలకు దారి తీస్తాయని కూడా అంటున్నారు.
ఇక చూస్తే వర్తమాన సామాజంలో పేదవారుగా రెడ్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఒక రెడ్డి బాగా ఉంటే మరో రెడ్డి కూడా అలాగే ఉంటారు అనుకోవడం ఎంతటి తప్పో అలాగే జగన్ సీఎం అయ్యారు కాబట్టి రాజకీయ అధికారం అంతా రెడ్లతే అని చేస్తున్న ప్రచారం కూడా రాంగ్ అని అంటున్నారు. కోన రఘుపతి లాంటి వారు ఇలాంటి ప్రకటనలు చేయడమే విడ్డూరం అంటున్నారు. దీని మీద ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.