Begin typing your search above and press return to search.
మా బాబాయ్ ను టీడీపీలో చేర్చమన్నారు!
By: Tupaki Desk | 21 March 2019 5:10 AM GMTతన బాబాయ్ కోన రఘుపతిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని - కోట్ల రూపాయల ప్యాకేజీని ఇస్తామని.. తన వద్దకు వచ్చి ఒక తెలుగుదేశం పార్టీ నేత - ప్రముఖుడు ప్రతిపాదించారని చెప్పారు రచయిత - నిర్మాత కోన వెంకట్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న దశలో కోన రఘుపతిని కూడా కొనాలని చూశారని - ఆ విషయంలో తన వద్దకే వచ్చి ప్రతిపాదన చేశారని వెంకట్ అన్నారు.
అయితే తన బాబాయ్ అలాంటి వాడు కాడని తను స్పష్టం చేసినట్టుగా - ఆయన అమ్ముడుపోయే రాజకీయ నేత కాదని తేల్చి చెప్పినట్టుగా కోన వెంకట్ చెప్పారు. తన మాటకు తగ్గట్టుగా కోన రఘుపతి అమ్ముడు పోకుండా నిలిచారని.. విలువలకు కట్టుబడ్డ ఆయన మళ్లీ గెలవడం ఖాయమని కోన వెంకట్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తన బాబాయ్ తరఫున బాపట్లలో ప్రచారం చేస్తున్నారు కోన వెంకట్. కోన రఘుపతి వారసులు అయిన కోన కుటుంబీకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో పని చేసిన వీళ్లు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్నారు. గత ఎన్నికల్లో కోన రఘుపతి బాపట్ల నుంచి విజయం సాధించారు. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కొంతమంది అడ్డు చెప్పినా జగన్ రఘుపతికే ప్రాధాన్యతను ఇచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్లు పొందిన ముగ్గురు బ్రహ్మణ రాజకీయ నేతల్లో రఘుపతి ఒకరు. ఈసారి గెలిస్తే రఘుపతి మంత్రి పదవి రేసులో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోన కుటుంబీకులు నియోజకవర్గంలో గట్టిగా కష్టపడుతూ ఉన్నారు.
వీరికి సినీ రంగంలో కూడా మంచి పరిచయాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోన రఘుపతి ప్రచారం కోసం కొంతమంది సినిమా వాళ్లు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.