Begin typing your search above and press return to search.
కోనసీమ అల్లర్లు.. మరో నిందితుడు అరెస్టు.. మొత్తం అరెస్టులు 143
By: Tupaki Desk | 15 Jun 2022 4:41 AM GMTఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన అల్లర్లు, విధ్వంసం ఘటనలకు సంబంధించి మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. అమలాపురం ముస్లిం వీధికి చెందిన అహ్మద్ వలీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఇవే కేసులకు సంబంధించి జూన్ 14న ముగ్గురు నిందితులైన అమలాపురం గోఖలే సెంటరుకు చెందిన చీకట్ల వీర వెంకట సత్యప్రసాద్, అమలాపురం సూర్యనగర్‌కు చెందిన గొవ్వాల వెంకటేష్, అమలాపురం శ్రీరామపురానికి చెందిన కేతా సురేష్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లర్లలో ఇప్పటి వరకూ 143 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఇప్పటివరకు పోలీసులు 268 మంది ఆందోళనకారులను గుర్తించారు. ఇప్పటికే 142 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 126 మంది కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తున్నారు. సీసీ ఫుటేజీలు, గూగుల్ ట్రాక్‌లు, టవర్ లొకేషన్లు, వాట్సాప్ గ్రూపులు వంటి సాంకేతిక సాధనాల ఆధారంగా ఈ కేసులను 14 పోలీసు బృందాలు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నాయి.
మరోవైపు పథకం ప్రకారం అమలాపురంలో విధ్వంసకర ఘటనలకు, అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారులను ఎవరినీ వదలబోమని పోలీసులు చెబుతున్నారు. ఈ అల్లర్లలో కేసులు నమోదైన నిందితులందరిపైనా త్వరలోనే రౌడీషీట్లు తెరుస్తామని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన నేరానికి వారిపై పీడీపీపీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
అలాగే కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆస్తులను అకౌంట్‌బులిటీ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల వ్యక్తిగత ఆస్తులపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు తయారు చేయించారు. నిందితుల ఆస్తులపై సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంలో మార్కెట్ రేట్లకు రెండురెట్లు అదనంగా నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేసే యోచనలో ఉన్నారు.