Begin typing your search above and press return to search.
కొణతాల....చివరికి ఇలా తేల్చేశారు
By: Tupaki Desk | 30 July 2015 7:25 AM GMTమాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల మాజీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ రాజకీయ అడుగులపై ఎప్పటికపుడు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కొణతాల బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో, బీజేపీలో కొణతాల చేరతారంటూ కొద్ది రోజుల క్రితం మీడియాలో బాగా ప్రచారం కొనసాగింది. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళాలని రంగం రెడీ చేసుకుంటున్నారంటూ కూడా వార్తలొచ్చాయి. అయితే అలాంటి ప్రయత్నం ఏదీ ఆయన చేసిన దాఖలాలు లేవు. అయితే తన రాజకీయ భవిష్యత్‌పై కొణతాల స్పందించారు.
పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇస్తూ....ఇప్పట్లో ఏ పార్టీలోనూ తాను చేరబోవడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ కార్యకర్తలతో సంబంధాలు మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నానని చెప్పారు.
వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్-గా ఉన్న కొణతాలను పార్టీ నుంచి తొలగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ లో నిర్ణయించారు. విశాఖపట్టణాన్ని కుదిపేసిన హుద్ హుద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జి, కొణతాల అనుచరుడు గండి బాబ్జీ హాజరు కాలేదు. సహాయక చర్యల్లోనూ బాబ్జీ పాల్గొనలేదు. దీంతో బాబ్జీని నియోజకవర్గ ఇంచార్జి పదవి నుంచి జగన్ తొలగించారు. ఈ చర్యను సహించని కొణతాల అప్పట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను నేరుగా జగన్ కే పంపించారు పార్టీలో తాను ఉండడం ఇష్టం లేదనుకుంటే, దానికి కూడా రాజీనామా చేస్తానని కొణతాల అదే లేఖలో స్పష్టంచేశారు. అప్పటి నుంచి కొణతాల రామకృష్ణ ఏ పార్టీకీ దగ్గర కాలేదు.