Begin typing your search above and press return to search.
అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ
By: Tupaki Desk | 8 March 2019 6:01 PM GMTఅందరూ అనుకున్నదే జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు కొణతాల రామకృష్ణ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ విశాఖ జిల్లా నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ విషయాన్ని చూచాయగా నాయకులకు అందించారు. కొణతాల లాంటి సీనియర్ నాయకుడు టీడీపీకి చాలా అవసరం అని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నట్లు సమాచారం.
అనకాపల్లి మాజీ ఎంపీగా - వైఎస్ హయంలో మంత్రిగా పనిచేసిన కొణతాల రామకృష్ణ..వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. 2014 వరకు వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. కానీ ఏమైందో ఏమో.. వైసీపీలో ఆయన ఇమడలేకపోయారు. బయటకు వచ్చేశారు. ప్రస్తుతం కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో లేరు. అయితే గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర చర్చా వేదిక అనే కార్యక్రమంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చంద్రబాబుని కూడా కలిశారు. ఆ సమయంలోనే చంద్రబాబు కొణతాల రామకృష్ణని పార్టీలోకి అహ్వానించారు. అయితే.. కార్యకర్తలతో మాట్డాడిన తర్వాత తన నిర్ణయాన్ని చెప్తానని అన్నారు ఆయన. ఈ ఉదయం తన నిర్ణయాన్ని చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. దీంతో.. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి కొణతాల రామకృష్ణని పోటీ చేయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవంతీ శ్రీనివాస్ రీసెంట్‌గా వైసీపీలో చేరారు.