Begin typing your search above and press return to search.

కొణ‌తాల బ్యాక్..జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

By:  Tupaki Desk   |   16 March 2019 10:55 AM GMT
కొణ‌తాల బ్యాక్..జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
X
దూరపు కొండ‌లు నునుపు అని ఊరికే అన‌లేదు. జ‌గ‌న్ పార్టీని విడిచి అధికారం కోస‌మో.. ఇత‌ర‌త్రా ప్ర‌యోజ‌నాల కోస‌మో కండువాలు క‌ప్పుకున్న నేత‌ల‌కు జ‌గ‌న్ పార్టీప్రాధాన్య‌త ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతున్న‌ట్లుంది. అందుకేనేమో.. అధికార పార్టీ నుంచి ఒక్కొక్క‌రుగా వెన‌క్కి వ‌చ్చేస్తున్నారు. తాజాగా సీనియ‌ర్ నేత‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న కొణ‌తాల రామ‌కృష్ణ తాజాగా మ‌ళ్లీ జ‌గ‌న్ పార్టీలోకి వ‌చ్చేశారు.

2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఆ త‌ర్వాత కాలంలో పార్టీకి దూరంగా ఉండ‌టం.. పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల నేప‌థ్యంలో ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. రెండు రోజుల క్రితం కూడా టీడీపీలో చేర‌నున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగినా.. అవ‌న్నీ ఉత్త‌వేన‌న్న విష‌యాన్ని రుజువు చేస్తూ ఈ రోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ వ‌ద్ద కొణ‌తాల క‌నిపించారు.

సొంత గూటికి తిరిగి వ‌చ్చేసిన కొణాత‌ల‌పై పార్టీ విధించిన స‌స్పెన్ష‌న్ వేటును తొల‌గించారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఆయ‌న‌.. పార్టీ కండువాను క‌ప్పుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌న‌కు ఏ మాత్రం పొస‌గ‌ని దాడి వీర‌భ‌ద్ర‌రావు ఈ మ‌ధ్య‌నే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కొణ‌తాల కూడా పార్టీలో చేరిన నేప‌థ్యంలో.. వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి బ్యాలెన్స్ ను జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి.. ఏ హామీతో కొణ‌తాల పార్టీలోకి వ‌చ్చార‌న్న దానిపై స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. ఏమైనా.. మొన్న‌టి వ‌ర‌కూ సైకిల్ ఎక్కుతార‌న్న అంచ‌నాల‌కు భిన్నంగా ఫ్యాన్ కింద‌కు వ‌చ్చేసిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.