Begin typing your search above and press return to search.
కొణతాలతో పాటు మరో వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 22 Dec 2015 3:00 PM GMTమాజీ మంత్రి.. వైసీపీకి దూరంగా ఉంటున్న నేత కొణతాల రామకృష్ణ, ఆయన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి టీడీపీలో చేరడంతో విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. కొణతాల చేరిక నేపథ్యంలో ఆ జిల్లా తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయిన అనంతరం కొణతాల మాట్లాడుతూ తాము టీడీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. తమ అనుచరులతో, కార్యకర్తలతో సమావేశమవుతామని, టీడీపీలో తాము ఎప్పుడు చేరేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
టీడీపీలో చేరికపై కొణతాల క్లారిటీ ఇచ్చిన అనంతరం ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొత్త అభిప్రాయాన్ని వెల్లడించారు. కొణతాలతో పాటు ఆయన అనుచరుడు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కూడా చేరతారని చెప్పారు. వీరి చేరికపై జిల్లా నేతలకు సమాచారముందన్న ఆయన... గండి బాబ్జి చేరినంత మాత్రాన సిట్టింగ్ ఎమ్మెల్యే బండారుకు ఇబ్బంది లేదన్నారు. అయితే వలసలతో కార్యకర్తలకు కొంత ఇబ్బంది తప్పదని చెప్పారు. తాను, గంటా శ్రీనివాసరావు కలిసి పని చేయడం లేదా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. కొణతాల చేరికకు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన తర్వాత ఎవరూ వ్యతిరేకించే ప్రసక్తే ఉండబోదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
మరోవైపు కొణతాల రామకృష్ణ టీమ్ చేరికపై గంటా శ్రీనివాసరావు వర్గంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నిర్ణయమేంటంటూ నేతలు పెదవి విరుస్తున్నారు. కొణతాల మీడియాతో మాట్లాడిన అనంతరం గంటా అనుచర ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కన్పించింది.