Begin typing your search above and press return to search.
కొణతాలకు బీజేపీ గాలం !
By: Tupaki Desk | 27 Dec 2015 5:36 AM GMTకొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ కు చెందిన ఈ మాజీ మంత్రి వైసీపీలో చేరి ఆ పార్టీతో విబేధించి బయటకు వచ్చి ఏడాదిగా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఖరారు అయిపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా విశాఖ నుంచి ప్రత్యేకంగా వచ్చి మరి హైదరాబాద్ లోని అసెంబ్లీలో చంద్రబాబును కొణతాల కలిశారు. అంతేకాదు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇపుడు కొణతాల పునర్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అది కూడా ఆయన మాటల ద్వారానే కావడం అసలు ట్విస్ట్.
విశాఖ జిల్లా మాడుగులలో ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా కొణతాల విలేకరులతో మాట్లాడుతూ...టీడీపీలో చేరికపై ఇప్పటికీ కార్యకర్తలతో చర్చిస్తూనే ఉన్నాననీ, మరొకసారి వారితో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటాననీ చెప్పారు!! కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారనున్నట్లు తెలిపారు! అయితే కొత్త సంవత్సరంలో తప్పనిసరిగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. బీజేపీ నుంచి ఇప్పటికీ తనకు ఆహ్వానం అందుతూనే ఉందని ప్రకటించడం మరింత ఆసక్తికరం.
విశాఖకు చెందిన కొణతాల రామకృష్ణ, ఆయన అనుచరుడు గండి బాబ్జితో సహా ఇతర నేతల రాకకు టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జిల్లా తెలుగుదేశం శ్రేణుల్లో నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. పై చేయి సాధించాలనే ఆలోచనతోనే మంత్రి అయ్యన్నపాత్రుడు బయట పార్టీల వారిని తమ పార్టీలోకి తెస్తున్నారని జిల్లా ఎమ్మెల్యేలతో పాటు మంత్రి గంటా లోలోన రగిలిపోతున్నారు. ఒకదశలో గంటా తన సన్నిహితుల వద్ద ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలన్నీ గమనించే...తెలుగుదేశంలో చేరికపై కొణతాల డైలమాలో ఉన్నారా అనే సందేహం వస్తోంది. లేకపోతే పార్టీ తరఫున మరోమారు తనకు ఆహ్వానం రావాలని బీజేపీ విషయాన్ని తెరమీదకు తెచ్చారా అనే భావన కూడా పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కదా.