Begin typing your search above and press return to search.
కూల్ అవొద్దు బాబు..ఇంకో ఉద్యమం రెడీ
By: Tupaki Desk | 21 Jun 2016 12:46 PM GMTకాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కు తెరపడిందో లేదో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు మరో నిరసన వచ్చిపడింది. టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకొని వెనక్కు తగ్గిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమిస్తానని పేర్కొన్న కొణతాల ఈ క్రమంలో కార్యాచరణ కూడా ప్రకటించేశారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని కొణతాల తెలిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. ఆగస్టు 15వ తేదీ వరకు సుజల స్రవంతి పథకం అమలు చేసే విశాఖ జిల్లాలో 18 మండలాలు - విజయనగరం జిల్లాలో 24 మండలాలు - శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాల్లో సంతకాలు సేకరిస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయాయన్నారు. సాగు - తాగునీరు పరిష్కారం కావాలంటే సుజల స్రవంతి పథకం ఒక్కటే మార్గమని కొణతాల వివరించారు. దీని ద్వారా విశాఖ జిల్లాలో 3.21 లక్షల ఎకరాలు - విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలు - శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు సాగు భూమికి నీరు లభిస్తుందన్నారు. మొత్తం 1,200 గ్రామాలకు తాగు నీరు అందివ్వవచ్చునని తెలిపారు. వ్యవసాయానికి 53.40 టీఎంసీలు - తాగునీరుగా 4.46 టీఎంసీలు - పరిశ్రమలకు 5.34 టీఎంసీల నీరు లభిస్తుందని కొణతాల వివరించారు.
దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2009 ఫిబ్రవరి 21వ తేదీన సబ్బవరంలో ఈ పథకానికి శంకుస్థాపన కొణతాల గుర్తుచేశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపిందన్నారు. అయితే ఇంత వరకు ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రులు కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.15వేల కోట్లు నిధులు అవసరమవుతాయన్నారు. అందువలన ఏటా రూ.ఐదు కోట్లు విడుదల చెయ్యాలని కోరారు. ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావల్సి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలు దీనిపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని కొణతాల కోరారు.