Begin typing your search above and press return to search.
'కొండ' కొడుతుందా..! కూలుస్తుందా....!?
By: Tupaki Desk | 26 Sep 2018 2:40 PM GMTవరంగల్ జిల్లా రాజకీయం రసకందాయనంలో పడింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగాను - మంత్రిగాను పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు అనుకోని పరిణామాలు తీసుకుంది. దీంతో కొండా సురేఖ దంపతులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితీలోకి మారారు. అక్కడ మంత్రి పదవి వస్తుందని ఆశించిన మొండి చెయి ఎదురైంది. కొండా సురేఖ ఎమ్మేల్యేగా ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగారు. ఇదీ తనను అవమానించడమేనని కొండా సురేఖ కీనుక వహించారు. దీనికి తోడు ముందస్తు ఎన్నికలలో కొండా సురేఖకు టిక్కెట్లు ఖరారు చేయలేదు. ఇది కూడా కొండా దంపతుల ఆగ్రహానికి కారణమైంది. నాలుగైదు రోజులలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెబుతూ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన - ఆయన తనయుడు కేటీఆర్ పైన తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. నాలుగైదు రోజులలో భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న కొండా దంపతులు హుటాహటిన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కొండా దంపతుల చేరికతో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకూ మేలు చేకూరతుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఆరు స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని కండా దంపతులు చెబుతున్నారు. ఈ దంపతులు కేవలం వరంగల్ కు పరిమితం కాదని తెలంగాణ అంతటా ప్రచారం చేయిస్తామని - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. అయితే వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి - బస్వరాజు సారయ్య - గుండు సుధారాణి - దాస్యం కుటుంబం వంటి కీలక నేతలున్న చోట కొండా దంపతులు కాంగ్రెస్ కు మేలు చేయగలరా అన్నది ప్రశ్నర్దకమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితీ అధ్యక్షుడ్ని - పార్టీ నాయకులను తీవ్ర పదజాలంతో విమర్శించిన కొండా సురేఖ దంపతులను బలంగా ఎదుర్కునేందుకు తేరాసా నాయకులు వ్యూహ రచన చేస్తారని అంటున్నారు. దీంతో వరంగల్ జిల్లాలో కొండా దంపతులు తెలంగాణ రాష్ట్ర సమితీని కొడతారా..లేక కాంగ్రెస్ పార్టీని కూలుస్తారా అన్నది చర్చనీయంశం అయ్యింది.