Begin typing your search above and press return to search.
కొండా సురేఖ షరతులు..ఆజాద్ ఓకే అంటే చాలు
By: Tupaki Desk | 11 Sep 2018 2:12 PM GMTఫైర్ బ్రాండ్ నాయకురాలు కొండా సురేఖ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో పేరులేకపోవడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కొండా సురేఖ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి గతంలో 45 వేల భారీ మెజారిటీతో గెలిచినా...టీఆర్ ఏస్ మొదటి లిస్ట్ లో తనపేరు లేకపోవడం భాధ కలిగించిందన్నారు. ``వరంగల్ ఈస్ట్ - పరకాల - భూపాలపల్లిలో మేమే పోటీ చేస్తాం..మీకు ఏమైనా అభ్యంతరమా? మేం ఎక్కడికి పోయినా...మమ్మల్ని ఇతర పార్టీలు తీసుకుంటాయి. 24 గంటలలోపు వాళ్ల నిర్ణయం ప్రకటించకపోతే మా నిర్ణయం ప్రకటిస్తాం`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కొనసాగింపుగా తాజాగా కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో...వరంగల్ తూర్పు - పరకాల - భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్ రావు సమావేశమయ్యారు. పరకాల నుంచి కొండా సురేఖ - వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని - మన సత్తా చాటుదామని మురళి వెల్లడించినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ లో చేరిక గురించి ఆమె ఏ ప్రకటన చేయలేదని సమాచారం.
ఇదిలాఉండగా...బుధవారం కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ చేరిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా దంపతుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించారని వారి చేరిక సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారని పేర్కొంటున్నారు.