Begin typing your search above and press return to search.
కొండా సురేఖ కోరిక.. కాంగ్రెస్ సీనియర్లకు బలం..
By: Tupaki Desk | 30 Sep 2018 12:39 PM GMTకొండా దంపతులు చివరికి కాంగ్రెస్ గూటికే చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువాలే కప్పేసుకున్నారు. వీరి చేరికతో వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండా దంపుతులు పార్టీ వీడడం వల్ల తమకు వచ్చిన నష్టమేం లేదని గులాబీ నేతలు తేల్చిచెబుతున్నారు.
కానీ కొండా దంపతుల చేరికతో కాంగ్రెస్ సీనియర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇన్నాళ్లు ఆ సమస్య చూసి భయపడ్డా నేతలందరూ కొండా దంపతులకు లభించిన హామీతో ఊపరిపీల్చుకున్నారు. తమ డిమాండ్ కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరూ ఈసారి తమ రాజకీయ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని.. కుటుంబ రాజకీయాలను పెద్దగా ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో తమ వారసులకు టికెట్లు ఎలా ఇప్పించుకోవాలో తెలియక లీడర్లు సతమతమవుతున్నారట.. ఈ సమయంలోనే jకొండా దంపతులు కాంగ్రెస్ కు జైకొట్టి అధిష్టానం వద్ద రెండు సీట్ల బేరం పెట్టారు. వరంగల్ తూర్పు - పరకాల రెండు సీట్ల హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్ లో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి కేసీఆర్ ను ఈ రెండు సీట్లు అడగడంతోనే కొండా సురేఖకు కూడా టికెట్ నిరాకరించారు. దీంతో పీసీసీ చీఫ్ ఈ రెండు సీట్ల హామీని ఇచ్చి రాహుల్ చేత ఒప్పించి నెరవేర్చాడట.. ఈ హామీ లభించడంతో కొండా సురేఖ కాంగ్రెస్ లో చేరిపోయారట.
ఇప్పుడు కాగల కార్యం కొండా దంపతులే తీర్చేశారు. అందుకే ఇన్నాళ్లు రెండు సీట్లు ఆశించిన సీనియర్లకు కొండా దంపతులు చేరి లైన్ క్లియర్ చేశారు. వారికి రెండు సీట్లు దక్కడంతో మిగతా వారికి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా గెలవాలని తలపోస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కొండా దంపతులకు రెండు సీట్లు ఇచ్చిందని.. అలాగే తమకూ రెండు సీట్లు ఇస్తుందని టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వారసులకు కూడా టికెట్ కావాలని పట్టుబడుతున్న జానారెడ్డి - గీతారెడ్డి - డీకే అరుణ - దామోదర రాజనర్సింహా - సబితా ఇంద్రారెడ్డి - భట్టి విక్రమార్కలకు లైన్ క్లియర్ అయ్యింది. వీరందరూ కూడా తమ వారికి టికెట్లు కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొండాకు ఇచ్చినట్టే తమకూ ఇస్తారని కొండంత ఆశలు పెంచుకున్నారట.. చూడాలి మరి కాంగ్రెస్ లోని వారసత్వ రాజకీయాలు ఈసారి పురుడుపోసుకుంటాయా లేదో..