Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి కొండా సురేఖ

By:  Tupaki Desk   |   22 Nov 2021 4:30 PM GMT
చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి కొండా సురేఖ
X
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబును, ఆయన భార్యను నానా మాటలు అని బాబు కన్నీళ్లకు కారణమైన వారిపై ఏపీలోనే కాదు.. బయటి రాష్ట్రాల్లోనూ స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దీనిపై స్పందించారు. చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా చంద్రబాబు కన్నీళ్లపై స్పందించడం విశేషం.

ఏపీ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఘటనపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత కొండా సురేఖ సైతం స్పందించారు. ‘ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశమంతా ఖండించాలన్నారు. భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచివేశాయని అన్నారు.

సాటి మహిళగా ఇలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు కొండా సురేఖ తెలిపారు. చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వం కించపరిచే వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. రాజకీయ దూషణలు కుటుంబాల వరకూ వెళ్లవద్దని సూచించారు.

ఏపీ రాజకీయ ప్రకంపనలు తెలంగాణలోనూ ప్రతిస్పందనలు వస్తున్నాయి. చంద్రబాబు ఏడుపుపై తెలంగాణ నేతలు స్పందించి మద్దతు పలుకుతున్నారు. తాజాగా కొండా సురేఖ కూడా స్పందించి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.