Begin typing your search above and press return to search.

మళ్లీ కాంగ్రెస్ లో ముసలం.. కొండా సురేఖ లేఖ కలకలం

By:  Tupaki Desk   |   26 Dec 2022 12:28 PM GMT
మళ్లీ కాంగ్రెస్ లో ముసలం.. కొండా సురేఖ లేఖ కలకలం
X
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం చల్లారడం లేదు. ఢిల్లీ నుంచి పెద్దలు దిగ్విజయ్ సింగ్ వచ్చి సీనియర్లను బుజ్జగించి నచ్చచెప్పినా సరే ఇంకా అసమ్మతి చెలరేగుతూనే ఉంది. దిగ్విజయ్ ఇక్కడి సీనియర్ నేతలతో మాట్లాడి.. సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేసి తనవంతుగా చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లినా కూడా పదవుల పంచాయితీ మాత్రం ఇంకా తగ్గడం లేదు.

ఇక దిగ్విజయ్ సింగ్ వెళ్లిపోయినా సరే అసమ్మతిని రగిలిస్తూనే ఉన్నారు కొండా సురేఖ. ఈ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తాజాగా దిగ్విజయ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ లేఖలో తనకు కాంగ్రెస్ పార్టీలో రెండు పదవులును ప్రస్తావిస్తూ ఏ పదవిని తనకు ఇచ్చినా న్యాయం చేస్తా అంటూ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన మాజీ మంత్రి గా తన అభిప్రాయాలు తెలియజేస్తూ టీపీసీసీ కమిటీలో తనకు స్థానం కల్పించాలని దిగ్విజయ్ సింగ్ కు కొండా సురేఖ లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె దిగ్విజయ్ సింగ్ ను అనారోగ్య కారణాలతో కలవేకపోయానని.. అంతేకాదు.. 1995లో రాజకీయాలను ప్రారంభించిన తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఒకసారి మంత్రిగా పనిచేశానని.. 2 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేవానని చెప్పుకొచ్చారు.

కొండా దంపతులుగా అందరితో పిలిపించుకునే తాము అటు ఆంధ్రప్రదేవ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించామని కొండా సురేఖ తెలిపారు. తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్న కొండా సురేఖ, తనకు ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు ఏఐసీసీ సెక్రటరీ కానీ.. వర్కింగ్ ప్రెసిడెం్ట కానీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీకి రాజీనామా చేసిన సమయంలో తాను ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ కు రాసిన లేఖలో తనకు అవకాశం కల్పించాలని.. కాంగ్రెస్ ను గెలిపించడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ లేఖను పోస్ట్ చేసిన కొండా సురేఖ, ఇక ఈ లేఖను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీలకు కూడా ట్యాగ్ చేయడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.