Begin typing your search above and press return to search.
వైఎస్ కుటుంబంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 9 Aug 2021 3:30 PM GMTఒకప్పుడు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న కొండా సురేఖ దంపతులు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ పార్టీలో చేరి మానుకోటలో రాళ్లదాడితో వీళ్లు ఫేమస్ అయ్యారు. జగన్ కోసం ఏకంగా మమంత్రి పదవికి కూడా కొండా సురేఖ రాజీనామా చేసి రోశయ్య కేబినెట్ నుంచి వైదొలిగారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. వైఎస్ షర్మిలతో కలిసి పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అసెంబ్లీలోనూ విజయమ్మకు అండగా నిలిచారు.
అయితే వైఎస్ జగన్ సమైక్య నినాదం ఎత్తుకోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు అదే సురేఖ.. వరుసగా షర్మిల-జగన్.. చివరకు విజయమ్మపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల తీరుపై మండిపడ్డారు.
షర్మిలకు ఇగో అని కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు. ఆమె పార్టీలో చేరే ఆలోచన లేదని స్ఫష్టం చేశారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత షర్మిల పాదయాత్ర చేసే సమయంలో తాను ఆమె తీరు చూశానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి అసలు అలాంటి స్వభావం ఉండరాదని సురేఖ చెప్పుకొచ్చారు. ప్రజలతో సాఫ్ట్ గా .. ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.హైప్రోఫైల్ తో వెళితే మనుగడ కష్టమన్నారు.
అన్న జగన్ అక్కడ ఒక తీరు మాట్లాడి.. చెల్లి ఇక్కడ మరో తీరు మాట్లాడుతున్నారని.. షర్మిల అధికారంకోసం వచ్చిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నుంచి తనకు ఆహ్వానం వచ్చినా తాను ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు.
విజయమ్మపై కూడా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో విజయమ్మకు తెలియదని.. పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్లనుకుంటోందా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత సురేఖ స్వయంగా వెళ్లి రేవంత్ ను కలిశారు. తాను కొత్తగా ఏ పార్టీలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి అంత విధేయురాలిగా పనిచేసిన కొండా సురేఖ రాష్ట్ర విభజన -తెలంగాణ అంశాల కారణంగా ఆ కుటుంబంతో దూరమయ్యారు. తాజాగా హాట్ కామెంట్స్ చేశారు.