Begin typing your search above and press return to search.
రాంగోపాల్ వర్మకు హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికిన కొండా సురేఖ
By: Tupaki Desk | 13 Oct 2021 6:44 AM GMTవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా వార్తే. తాజాగా ఆయన తెలంగాణ ఫైర్ బ్రాండ్స్ కొండా సురేఖ దంపతుల జీవిత చరిత్రను సినిమా తీయాలని సంకల్పించారు. ‘కొండా’ పేరుతో తీస్తున్న ఈ సినిమా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించి తాజాగా షూటింగ్ ను వరంగల్ లో ప్రారంభించారు.
వరంగల్ కు తమ సినిమా తీయడానికి వచ్చిన రాంగోపాల్ వర్మకు జన్మలో మరిచిపోలేని స్వాగతాన్ని ఇచ్చారు కొండా సురేఖ దంపతులు. కొండాసురేఖ ఇంటికి వెళ్లిన రాంగోపాల్ వర్మకు సురేఖ హారతి పట్టి దిష్టి తీసి మరీ స్వాగతం పలికారు. కొండా చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొండా సురేఖ అనుచరులతో కలిసి వర్మ ర్యాలీ తీయడం విశేషం. వర్మకు కొండా దంపతులు ఈ రేంజ్ లో గౌరవిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వరంగల్ లో పెద్ద ఎత్తున కొండా సినిమా నిర్మాణం హడావుడిగా కొనసాగింది.ఒకవైపు ఒక వర్గం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్మ ఏం తీసుకుంటారో ఎవరిని విలన్లుగా చూపిస్తాడో నన్న ఆందోలన సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా వంచనగిరి సమీపంలో చిత్ర నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో అక్కడికి జనాలు పోటెత్తుతున్నారు.
ఇక తాను దేవుళ్లను నమ్మనని.. నాస్తికుడిని అని చెప్పే వర్మ ‘కొండా’ సినిమా షూటింగ్ సందర్భంగా వంచనగిరిలోని గండి మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు చేయడం విశేషం. మద్యాన్ని అమ్మవారికి సమర్పించిన వర్మ ఆశ్చర్యపరిచాడు. మద్యం అంటే ఇష్టపడే వర్మ ఇలా చేశాడని తెలుస్తోంది. దీనిపై ట్వీట్ కూడా చేశాడు.
‘తాను మాత్రమే ఓడ్కా తాగుతానని అనుకున్నానని..కానీ తాను మైసమ్మ తల్లిని విస్కీ తాగేలా చేశాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.