Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో సంప‌న్న అభ్య‌ర్థి ఆయ‌నే!

By:  Tupaki Desk   |   23 March 2019 6:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో సంప‌న్న అభ్య‌ర్థి ఆయ‌నే!
X
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హీట్ ఎంత ఎక్కువ‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తొలి ద‌శ‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏపీలో పార్ల‌మెంటు.. అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.. తెలంగాణ‌లో మాత్రం ఎంపీ స్థానాల‌కుఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రుగుతున్న నామినేష‌న్ల ప‌ర్వంలో ఇప్ప‌టివ‌ర‌కూ దాఖ‌లైన నామినేష‌న్ల‌లో అత్యంత సంప‌న్న అభ్య‌ర్థిగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ.. తాజాగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి నిలిచారు. రెండురాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద ఎత్తున నామినేష‌న్లు దాఖ‌లైనా.. వాట‌న్నింట్లోనూ అత్యంత సంప‌న్న అభ్య‌ర్థిగా ఆయ‌న నిలిచారు.

అధికారికంగా ఆయ‌న ప్ర‌క‌టించిన ఆస్తుల ప్ర‌కారం కొండా ఆస్తులు రూ.895 కోట్లుగా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌నే అత్యంత సంప‌న్న అభ్య‌ర్థిగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఆయ‌న త‌ర్వాత స్థానంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ నిలిచారు. కాకుంటే.. ఆయ‌న ఎపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఆస్తులు రూ.650 కోట్లుగా పేర్కొన్నారు. ఇక‌.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఆస్తుల్ని రూ.339 కోట్లుగా పేర్కొంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న ఆస్తుల్ని రూ.20కోట్లుగా పేర్కొన్నారు.

ఇక‌.. న‌ర‌సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ర‌ఘురామ కృష్ణంరావు ఆస్తులు రూ.324 కోట్లుగా పేర్కొంటే.. గుంటూరు టీడీపీ అభ్య‌ర్థి గ‌ల్లా జ‌య‌దేశ్ ఆస్తుల విలువ రూ.266 కోట్లుగా పేర్కొన్నారు. ఇక‌.. సినీ న‌టుడు బాల‌కృష్ణ చిన్న‌అల్లుడు.. విశాఖ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ ఆస్తులు రూ.200 కోట్లుగా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోసంప‌న్న అభ్య‌ర్థి తెలంగాణ ఖాతాలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం.