Begin typing your search above and press return to search.
కొండగట్టు హనుమా..కల్వకుంట్ల తీరు కనుమా
By: Tupaki Desk | 11 Sep 2018 4:59 PM GMTతెలంగాణలో ప్రాణాలు గాలిలో దీపాలు అవుతున్నాయి. రోజురోజుకు జీవన భద్రత కరవవుతోంది. ప్రజలు ప్రాణలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం ధర్మమో - ఆపధర్మమో చేష్టలుడిగి చూస్తోంది. ఇదీ ఏ విధమైన ప్రగతి నివేదనో పాలకులకే కాదు ప్రతిపక్షాలకు, ప్రజలకు కూడా ఇసుమంతైనా అర్దం కావటం లేదు. దీనికి మంగళవారం నాడు జరిగిన కొండగట్టు బస్సు ప్రమాద సంఘటనే తాజా ఉదాహరణ. ఆర్టీసీలో ఆక్యూపేన్సీ పెరగాలి దాని ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరగాలి. తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరాలి. ఇందుకోసం ఏమైనా చేయాలి....ఏదైన చేయాలి......ఏలగైన చేయాలి. ఇదే సూత్రాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తూ.చా తప్పకుండా పాటిస్తోంది. దీని ఫలితమే కొండగట్టు బస్తు ప్రమాదం అని అంటున్నారు.
ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించారు. వీరంతా హనుమంతుడికి ప్రీతి కరమైన మంగళవారం నాడు హనుమంతుని దర్శించుకోవాలని అనుకున్న వారే. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదానికి ఆర్టీసీ అధికారులు - ఆ ఎండ్ బి అధికారులదే నైతిక బాధ్యతని తెలంగాణ ప్రజలే కాదు తెలగు ప్రజలందరూ ముక్త కంఠంతో అంటున్నారు. నలభై నుంచి యభై మంది మాత్రమే ప్రయాణించే బస్సులలో ఎనభై మందిని ఎక్కించడం ఎలాంటి ప్రగతి నివేదన అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక స్పీడు బ్రేకర్లకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ప్రతీ స్పీడు బ్రేకర్ పై వాహానాలకు కనిపించేల హెచ్చరిక సిగ్నల్స్ ఉండాలి. ఇవీ రాత్రి పూట కూడా కనిపించేలా రేడియం స్టికర్లు ఉండాలి. స్పీడు బ్రేకర్ల ఎత్తుపై ఓ నియంత్రణ ఉండాలి. ఇందుకు ఆర్ ఎండ్ బి రూపొందించిన మార్గదర్శకాలు ఉండాలి. కొండగట్లు ప్రమాదంలో ఈ జాగ్రత్తలు కాని నిబంధనలు కాని కనిపించకపోవడం ఆశ్చర్యానికి కాదు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏకంగా యభై మందికి పైగా మరణించిన ఈ ప్రమాదానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆపధర్మ ప్రభుత్వం చేతులు దులుపు కుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు - నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలియవేమో కాని కొండగట్టు హనుమంతునికి మాత్రం తెలుస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.