Begin typing your search above and press return to search.
మాష్టారి మాదిరి మీడియా ఆలోచించట్లేదా?
By: Tupaki Desk | 9 Jun 2016 5:19 AM GMTఇప్పుడో ప్రశ్న చాలామంది తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును సునిశితంగా విమర్శిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం చెబుతున్న మాటలు చాలానే సందేహాల్ని లేవనెత్తుతున్నాయి. గడిచిన రెండేళ్ల వ్యవధిలో తెలంగాణ అధికారపక్షం మీద ఈ తరహాలో విమర్శలు చేసిన వారు లేరు. విమర్శలు చేసినా.. వారంతా రాజకీయ నాయకులు కావటం.. వారి మాటల్లో ‘రాజకీయం’ వినిపించేదే తప్పించి.. తెలంగాణ మీద ప్రేమ.. అభిమానం.. కమిట్ మెంట్ లాంటివి కనిపించకపోవటంతో ఎవరూ వారి మాటల్ని సీరియస్ గా తీసుకోని పరిస్థితి. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ శ్రమిస్తుంటే.. చిల్లరగా మాట్లాడుతున్నారేంటన్న భావన కొన్నిసార్లు కలిగిన పరిస్థితి.
అందుకు భిన్నంగా కోదండరాం లేవనెత్తిన అంశాలు తెలంగాణ సమాజంలో సరికొత్త చర్చకు తెర తీశాయి. రాజకీయ నాయకుల సంగతిని పక్కన పెడితే.. సాపేక్షంగా వ్యవహరించాల్సిన మీడియా గడిచిన రెండేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు తీరును ఎందుకు విమర్శించలేదు? సర్కారుచేసిన తప్పుల్ని ఎందుకు ఎత్తి చూపలేదు? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల పాలన గురించి అంతా ఆహా.. ఓహో అంటూ పొగిడేశారే తప్పించి.. కేసీఆర్ పాలనలోని లోటుపాట్లను ఎత్తి చూపేలా ప్రధాన మీడియా సంస్థలేవీ వ్యవహరించలేదన్న విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. కోదండరాం మాష్టారు ప్రస్తుతం లేవనెత్తుతున్న అంశాల గురించి.. ఆ సమస్యల గురించి మీడియా ఎందుకు హైలెట్ చేయలేదు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి.
అలా అని సగటు రాజకీయ నేతల మాదిరి అవసరం ఉన్నా లేకున్నా విరుచుకుపడటం.. విమర్శలు చేసే కన్నా.. తెలంగాణ ప్రయోజనాలకు పరిరక్షకులుగా మీడియా ఎందుకు వ్యవహరించలేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కోదండరాం మాష్టారు లేవనెత్తిన అంశాల్ని చూసినప్పుడు.. ఈ సమస్యలపై మీడియా కనీసం దృష్టి సారించలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్చ మీడియాకు ఒక హెచ్చరికగా చెప్పొచ్చు. ఇలాంటివి పదే పదే చోటు చేసుకుంటే.. మీడియాకు ప్రాణసమానమైన విశ్వసనీయత మీద సందేహాలు వ్యక్తం కావటమే కాదు.. దశాబ్దాల తరబడి ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కోదండరాం మాదిరి కాకున్నా.. ఆ తరహాలో కేసీఆర్ సర్కారు చేసిన తప్పులు మీడియాకు ఎందుకు కనిపించనట్లు చెప్మా..?