Begin typing your search above and press return to search.
వైసీపీ వైపు కొండ్రు చూపు... ఎంట్రీ కష్టమేనట
By: Tupaki Desk | 19 Feb 2020 5:38 PM GMTఎప్పటికప్పుడు పార్టీలు మారిపోతున్న నేతల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇలాంటి వారి జాబితాలో తాజాగా మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పేరు కూడా చేరిపోతోందా? అంటే... విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొండ్రు... తాజాగా వైసీపీలోకి చేరిపోయేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొండ్రుకు వైసీపీలోకి ఎంట్రీ దక్కడం అంత ఈజీ కాదన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొండ్రు వస్తానన్నా... ఆయనను పార్టీలోకి రానిచ్చేది లేదంటూ వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు బహిరంగంగానే సంచలన ప్రకటనలు చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం నడుపుతున్న కొండ్రు... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఉమ్మడి ఏపీలో ఓ రేంజికి ఎదిగారు. ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా పదవి దక్కించుకున్న కొండ్రుకు నిత్యం తన సొంత ఇలాకాలో సొంత వర్గంలోనే కుంపట్లు రాజుకున్న వైనంతో ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని కొండ్రు... తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం రాకుండా చాలా జాగ్రత్తగానే పావులు కదుపుతున్నారు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చచ్చిపోగా... 2019 ఎన్నికల దాకా అదే పార్టీలోనే కొనసాగిన కొండ్రు... ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ... కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చేసి టీడీపీలో చేరిపోయారు.
అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ వైపు బలంగా వీచిన గాలిలో హేమా హేమీలతో పాటు కొండ్రుకు కూడా పరాజయం తప్పలేదు. తాజాగా ఏపీలో టీడీపీ బాగా బలహీనపడిపోగా... తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే క్రమంలో వైసీపీలో చేరే దిశగా కొండ్రు పావులు కదుపుతున్నారట. ఈ క్రమంలోనే టీడీపీలోనే ఉన్నా... ఆ పార్టీ కార్యక్రమాలకు ఆయన అంటీముట్టనట్టుగానే వ్వవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీడీపీలో ఉండగా... తమను నానా ఇబ్బందులు పెట్టిన కొండ్రును వైసీపీలోకి రానిచ్చేది లేదని, ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా చెబుతామని రాజాం వైసీపీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. వైసీపీలోకి ఎంట్రీ కొండ్రు అనుకున్నంత ఈజీగా అయితే దొరికేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ అడ్డంకులను తొలగించుకుని కొండ్రు తాను అనుకున్నట్లుగా వైసీపీలోకి ఎలా చేరిపోతారో చూడాలి.