Begin typing your search above and press return to search.

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా .. భార్యకి కూడా ..!

By:  Tupaki Desk   |   26 Aug 2020 2:30 PM GMT
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా .. భార్యకి కూడా ..!
X
తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి జోరు చూపిస్తుంది. ఈ మధ్య రోజు నమోదు అయ్యే కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణ లో సామాన్యుల నుండి ప్రజా ప్రతినిధులను కూడా కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ‌ ఎమ్మెల్యే లను కరోనా భయపెడుతుంది. వరుసగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయనతో పాటుగా అయన భార్యకు కూడా కరోనా సోకింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని అధికారులు వెల్లడించారు.

ఆయనకి కరోనా అని తేలడంతో కుటుంబ సభ్యుల తో కలిసి ఆయన ఐసోలేషన్ ‌లో ఉంటున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. గతకొన్ని రోజులుగా తనను కాంటాక్ట్ అయిన అందరూ జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితే టెస్టులు కూడా చేయించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి , ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, ఎమ్మెల్యే సురేందర్‌, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మృతుల సంఖ్య 780కి పెరిగింది.