Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి వీరంగం
By: Tupaki Desk | 30 Jun 2019 7:21 AM GMTటీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అధికార బలంతో ఏకంగా అధికారులపైనే దాడులు చేసేంత స్థాయికి దిగజారడం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది.
కాగజ్ నగర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు - జడ్పీ వైస్ చైర్మన్ అయిన కోనేరు కృష్ణ అధికారులపై రెచ్చిపోయారు. అనుచరులతో కలిసి అటవీశాక రేంజ్ ఆఫీసర్ - సిబ్బందిపై కర్రలతో దాడులకు దిగారు.
ఆదివారం ఉదయం కాగజ్ నగర్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్మాయ అటవీకరణ పనులను నిర్వహించడం మొదలు పెట్టారు. గిరిజనులు - ఇతరులు అడవులను కొట్టి సాగు చేసుకుంటున్న భూములను అటవీకరణ చేసేందుకు అటవీ అధికారులు పూనుకున్నారు.
అయితే జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ ఈ పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి జులం ప్రదర్శించారు. పనులను అడ్డుకొని అటవీ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అనంతరం రెచ్చిపోయి కోనేరు కృష్ణ, ఆయన అనుచరులు.. అటవీ రేంజ్ ఆఫీసర్ అనితతోపాటు సిబ్బందిపై కర్రలు - రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారి అనితకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అటవీ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమ్ముడిను అరెస్ట్ చేయాలని కోరారు.