Begin typing your search above and press return to search.

వైసీపీకి కోనేరు గుడ్‌ బై

By:  Tupaki Desk   |   17 March 2016 4:03 AM GMT
వైసీపీకి కోనేరు గుడ్‌ బై
X
ఏపీలో ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోనేరు ప్రసాద్‌ రాజీనామా చేశారు. గత సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయవాడ లోక్‌ సభ స్థానానికి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కోనేరు ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కోనేరు రాజేంద్రప్రసాద్ ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్నారు. 2014 మార్చిలో కోనేరు ప్ర‌సాద్ వైసీపీలో చేరారు. చేరిన మ‌రుస‌టి రోజే ఆయ‌న‌కు విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్ అనంత‌రం ఎన్నిక‌ల్లో పోటీకి దింపారు. సార్వ‌త్రిక పోరులో టీడీపీ-బీజేపీ అభ్య‌ర్థి కేశినేని నాని చేతిలో కోనేరు ఓడిపోయారు.