Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రామారావు..వ్యూహం ఫలించేనా?
By: Tupaki Desk | 29 Sep 2019 3:40 PM GMTతెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక్కడ గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పంతంపట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక, బీజేపీ - టీడీపీ - సీపీఎంలు కూడా తమసత్తా చాటేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వగా.. కాంగ్రెస్ తరఫున కూడా మాజీ ఎమ్మెల్యే పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీకి దిగుతున్నారు. ఇక, మిగిలిన పార్టీల తరఫున పురుష అభ్యర్థులు తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని సిద్ధం చేసింది.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, రామారావుతో పాటు ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి పేర్లతో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధిష్టానానికి పంపింది. అంతా అనుకున్నట్లుగానే రామారావునే బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న సేవలందించిన రామారావు.. మూడు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక కోణంలో రామారావును బరిలోకి దించితే కలిసి వస్తుందని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది.
గరిడేపల్లి మండలం కేతవారిగూడెంకు చెందిన కోట రామారావు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం యువత బీజేపీ వైపు చూస్తున్నారని - టీఆర్ ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని మర్చిపోయిందనిఅ ప్పుడే ఆయన విమర్శలు ప్రారంభించారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. అధికార పక్షంపై ఉన్న అసంతృప్తే తనను గెలిపిస్తుందిన ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని ఇప్పటికే కేంద్రం నుంచి నిర్దిష్టమైన సంకేతాలు అందిన నేపథ్యంలో ఈ సీటును గెలిచి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో రాజా సింగ్ ఒక్కరే బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామారావును గెలిపించుకోవడం ద్వారా అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థుల సంఖ్యను రెండుకు చేర్చాలని చూస్తున్నారు. మరి ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి.