Begin typing your search above and press return to search.

సీఎంను జంపింగ్ ఎంపీ ఎన్ని మాట‌లు అనేశారో

By:  Tupaki Desk   |   27 Nov 2016 10:12 AM GMT
సీఎంను జంపింగ్ ఎంపీ ఎన్ని మాట‌లు అనేశారో
X
అరకు ఎంపీ కొత్తపల్లి గీత మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గీత టీడీపీలో చేరిన గీత పార్వతీపురంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన స్వచ్ఛభారత్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆమె కలెక్టర్‌ అతిధి గృహంలో కొత్త‌ప‌ల్లి గీత‌ విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగాక ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని, సమస్య పరిష్కారానికి తాత్కాలికంగా ప్రత్యేక ప్యాకేజి అవసరమేనని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొత్త‌ప‌ల్లి గీత అన్నారు. హాదా రావాలంటే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, లేకుంటే సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

భవిష్యత్‌ లో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ప్ర‌త్యేక హోదా ఉండాలన కొత్త‌ప‌ల్లి గీత అన్నారు. ఇందుకోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నప్ప‌టికీ, కేంద్రంపై మ‌రింత ఒత్తిడి తెస్తేనే హోదా సాధ్యమవుతుందన్నారు. తాను పవన్‌కళ్యాణ్‌ పార్టీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదని కొత్త‌ప‌ల్లి గీత వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ విష‌యంలో త‌న‌పై దుష్ప్ర‌చారం జ‌రిగింద‌ని అన్నారు. పార్టీల కంటే ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. కేంద్రం నోట్లు రద్దును వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాని, దీని వల్ల నకిలీ కరెన్సీని అరికట్టవచ్చునని తెలిపారు. ఇదిలాఉండ‌గా రాష్ట్రంలో మండలాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.3300 కోట్లు వచ్చాయని, కానీ ఈ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ప‌రిపాల‌న తీరును త‌ప్పుప‌ట్టారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి నిధులు సక్రమంగా అమలు జరిగేలా చూస్తామన్నారు. తన పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంటూ ప్రతీ నియోజక వర్గానికి కనీసం 2వేల బోర్లు ఉండాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఆ విధమైన స‌దుపాయాలు లేవ‌న్నారు. కాగా వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గీత టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండ‌గా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని పేర్కొంటూ విశాఖ జిల్లా శివలింగాపురానికి చెందిన శెట్టి గంగాధరస్వామి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొత్తపల్లి గీత ఎస్టీ (వాల్మీకి)గా నిర్ధరిస్తూ ఏపి ప్రభుత్వం 2015 జులై 27న గెజిట్‌లో ప్రచురించింది. అయితే కొత్తపల్లి గీత సోదరుడు కొత్తపల్లి వివేకానందకుమార్‌ ఎస్టీ కాదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ నిర్ధరించారని, కానీ గీతను ప్రభుత్వం ఎస్టీగా ఎలా ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి పొందేందుకే అలా చేశారని, యిది చట్ట విరుద్ధమని, ఈ సమయంలో రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టు జోక్యం చేసుకు ని గీత ఎస్టీ కాదని తీర్పు చెప్పాలని రిట్‌ లో కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌, కొత్తపల్లి గీతలను చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/