Begin typing your search above and press return to search.

లోన్ ముందే తీర్చేస్తారా..6ల‌క్ష‌లు ఫైన్ క‌ట్టండి

By:  Tupaki Desk   |   5 May 2018 4:17 AM GMT
లోన్ ముందే తీర్చేస్తారా..6ల‌క్ష‌లు ఫైన్ క‌ట్టండి
X
బ్యాంకుల చిత్ర విచిత్ర‌మైన నిబంధ‌న‌ల‌కు ఇదో తార్కాణం. ఓ వైపు అప్పుల క‌ట్ట‌కుండా వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంటే ఓ బ్యాంక్ చిత్ర‌మైన రూల్ పెట్టింది. దీంతో అవాక్క‌వ‌డం సంస్థ వంతు అయింది. స‌హ‌జంగా బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఠంచన్‌ గా కట్టాలనే రూల్ అంద‌రికీ తెలిసిందే. తీసుకున్న లోన్‌ నయాపైసాతో సహా కడతామంటే కస్టమర్‌ కు ఫుల్‌ గా సపోర్ట్‌ చేయాలి. ఇంకా చెప్పాలంటే ది బెస్ట్‌ కస్టమర్‌ అని కీర్తించాలి. ఎందుకంటే ఈ మధ్య బ్యాంకులను ముంచి పారిపోయిన బడా పారిశ్రామికవేత్తలు.. రూపాయుల్లో ఆస్తులు చూపించి పైరవీలతో కోట్లలో లోన్లు ఎగ్గొట్టి ఫారిన్‌ చెక్కేశారు కాబ‌ట్టి. కానీ ఓ బ్యాంకు అందుకు నో చెప్పి చిత్ర‌మైన షాకిచ్చింది. ఇది జ‌రిగింది ఎక్క‌డో కాదు హైద‌రాబాద్‌ లోనే.!

కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లో హైదరాబాద్‌ కు చెందిన ట్రావెల్ క్లబ్ సంస్థ కోటిన్నర వరకూ లోన్ తీసుకుంది. అది 2020లో ఎక్స్‌ పైర్ అవుతుంది. అయితే అనేక ఆర్థిక కారణాలతో సదరు సంస్థ ముందే లోన్ తీర్చేస్తామంటూ కోటక్ బ్యాంక్‌ ను సంప్రదించింది. అయితే లోన్ ముందే కట్టేస్తే.. రూ.6 లక్షల పెనాల్టీ కట్టాలంటూ బ్యాంక్ హుకుం జారీ చేసింది. పద్ధతిగా తీసుకున్న అప్పు చెల్లిస్తామంటే.. కాదు కుదరదు.. రూల్స్‌ ఒప్పుకోవని అన‌డం ఏంట‌ని స‌ద‌రు ట్రావెల్‌ సంస్థ వాపోయింది. లోన్ ముందే తీర్చేస్తాం మొర్రో అంటున్నా వినకుండా పెనాల్టీలు విధిస్తామనడం ఎంత వరకూ సమంజసమో అర్థం కావడం లేదంటూ మీడియాను ఆశ్ర‌యించింది. దీంతో ఆ బ్యాంక్ వ‌ద్ద‌కు మీడియా సిబ్బంది వెళ్ల‌గా ఊహించ‌ని రిప్లై వ‌చ్చింది. లోన్ డిఫాల్ట్ అయితే అసలు, వడ్డీ వదులుకుంటాం కానీ.. ఇలా ముందే అప్పు తీర్చేస్తే ప్రీ పేమెంట్ పెనాల్టీ కట్టాల్సిందేనని కోటక్ మహీంద్రా బ్యాంక్ మొండికేసి చెప్పేసింది. ఆర్బీఐ నిబంధనలు ఇలానే ఉన్నాయా అంటూ ప్రశ్నించిన మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం కొస‌మెరుపు.