Begin typing your search above and press return to search.

కోటంరెడ్డి ఎపిసోడ్ లో లాభమెంత? నష్టమెంత?

By:  Tupaki Desk   |   6 Oct 2019 12:26 PM GMT
కోటంరెడ్డి ఎపిసోడ్ లో లాభమెంత? నష్టమెంత?
X
వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా వేడి పుట్టించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దెందలూరు ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గానికి సామంతరాజుల వ్యవహరించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన అధికారులపై దాడులు, దళితులు, ఇతర వర్గాలపై దాడులు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం ఆయనపై ఈగవాలనీయలేదు. చింతమనేని రక్షించాడన్న విమర్శలు వచ్చాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నినాళ్లు చింతమనేని రక్షిస్తూ రావడంతో ఆయన ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. చివరకు చంద్రబాబు ఉదాసీనత కారణంగా టీడీపీ కొంప ముంచిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగాయి.

అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వంలో చింతమనేని ఎపిసోడ్ తలపించేలా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం దుమారం రేపింది. కోటంరెడ్డితోపాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ విషయాన్ని స్వయంగా డీజీపీ సవాంగ్... సీఎం జగన్ కు నివేదించారట.. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేలడంతో జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.తప్పు చేసి ఉంటే చట్టం ముందు అందరూ సమానులేనని.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిను అరెస్ట్ చేయాలని ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడాన్న వార్త సంచలనంగా మారింది. చింతమనేని చేసిన అరాచకాలు చూశాక.. సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును తప్పు పట్టి జగన్ అరెస్ట్ కు సిద్ధపడడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు కురిశాయి.

జగన్ తీసుకున్న నిర్ణయం అధికారపార్టీనే కాదు.. ప్రతిపక్ష టీడీపీని కూడా షాక్ కు గురిచేసింది. అవినీతి, అక్రమాల విషయంలో తాను ముక్కుసూటిగా వెళతానని జగన్ ఈ నిర్ణయంతో అందరికీ చాటిచెప్పారు. తప్పు చేస్తే తన మన అన్న తేడాలేదని జగన్ నిరూపించారు.

అయితే తాజాగా ఈ వివాదంలో అరెస్ట్ అయిన కోటంరెడ్డికి స్టేషన్ బెయిల్ మీద విడుదలయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే విడుదల కావడంపై ప్రతీపక్ష టీడీపీ, ఇతర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. సీఎం జగన్ ఎంతో సదాశయంతో అరెస్ట్ చేయిస్తే నామమాత్రపు బెయిల్ తో విడుదల చేసిన తీరు ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం వృథా అయ్యిందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.