Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి మళ్లీ కోపమొచ్చింది.. రీజనేంటంటే!
By: Tupaki Desk | 24 Dec 2022 2:30 AM GMTవైసీపీ సీనియర్ నాయకుడు.. సీఎంగా జగన్‌ను చూసేందుకు తపించిన నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు బెర్తు ఉంటుందని ఆశించారు. అయితే.. అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు. దీనిపై ఆయన ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నా.. మనసు పెట్టడం లేదనే టాక్ ఉంది.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయనకు మరోసారి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అది అధిష్టానంపై కోపమే అయినా.. ఆయన నేరుగా అధిష్టానంపై చూపించలేక అధికారుల పై చూపించారనే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల తీరుపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
నాలుగేళ్లగా తన రూరల్ నియోజకవర్గంలో పనులేమీ జరగడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.(వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉంది. దీనిపై ఆయన అనేక నిరసనలు కూడా చేశారు. కానీ, ఇప్పుడు మళ్లీ అధిష్టానంపై ఉన్న అక్కసును ప్రదర్శించారని అంటున్నారు.) సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసిన పనులకు సైతం అధికారులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదన్నారు.
బారాషాహీద్ దర్గాలో రూ.15 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు మంజూరు చేస్తే, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్, మైనార్టీ గురుకుల పాఠశాల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని అభివృద్ధి పనులు ఆపేసిన అధికారులు, కోటి రూపాయల వ్యయంతో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నివాసం నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.
మంత్రులు, అధికారులు మారుతున్నా.. పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావ త్ కార్యాలయానికి వెళ్తే కనీసం మర్యాద కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే.. ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.