Begin typing your search above and press return to search.

టీడీపీలోకి కోటంరెడ్డి బ్ర‌ద‌ర్‌.. నెక్ట్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   24 March 2023 8:44 PM GMT
టీడీపీలోకి కోటంరెడ్డి బ్ర‌ద‌ర్‌.. నెక్ట్స్ ఏంటి?
X
నెల్లూరు రూర‌ల్ నియోక‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి సోద‌రుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో గిరిధర్‌రెడ్డి టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. గిరిధర్‌రెడ్డి టీడీపీ చేరుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలున్న ప్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. గిరిధర్‌రెడ్డి నెల్లూరు నుంచి 300 కార్ల భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి వెళ్ల‌డం విశేషం.

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను అధికార వైసీపీ క్లీన్ చిప్ చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీకి జిల్లాలో వ్య‌తిరేక స్వ‌రాలు పెరుగుతున్నాయి. మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌మోహన్‌రెడ్డి పై ధిక్కార స్వరం వినిపించారు. ఆ వెనువెంటనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారనే ఆవేదనతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి నిష్కమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

అంతేకాదు.. అధికార పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకులు జగన్‌రెడ్డిపై, ఆయన ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతానికి వీరి తిరుగుబాటు ప్రభావం రాష్ట్రమంతా కనిపించక పోయినా లోలోన రగిలిపోయే ఎంతోమంది వైసీపీ నాయకులకు ద‌న్నుగా ఉంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రత్యేకమ‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. త్వ‌ర‌లోనే కోటంరెడ్డికూడా పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేశార‌నే ఉద్దేశంతో పార్టీ నుంచి స‌స్సెండ్ చేశారు. దీంతో కోటంరెడ్డిఇప్పుడు వైసీపీలో లేన‌ట్టే. ఈనేప‌థ్యంలో కోటంరెడ్డి త్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, ఆనం కూడా ఇదే బాట‌లో న‌డుస్తార‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.