Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో బాహుబలి-2 స్పెషల్ షో!
By: Tupaki Desk | 28 March 2017 5:26 AM GMTతెలుగు సినీ పరిశ్రమను ఊహించని స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి సినిమా త్వరలో బాహుబలి కన్ క్లూజన్ పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శనకు థియేటర్లతో పాటు అసెంబ్లీలో సైతం చాన్స్ దొరికింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయం చెప్పారు! అసలు విషయం ఏమిటంటే...అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఎదురుపడ్డ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు - వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా `ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేకపోవటంతో ఈ రోజు సభ ప్రశాంతంగా జరిగింది` అని చీఫ్ విప్ కాలువ అనటంతో...మాకు మాట్లాడే అవకాశం ఇస్తే గొడవలెందుకు జరుగుతాయని కోటంరెడ్డి తిప్పికొట్టారు. అసెంబ్లీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని కోటంరెడ్డి అనగా.. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు - సలహాలు - సద్విమర్శలు చేస్తే మాకెలాంటి అభ్యంతం లేదన్నారు. అలాకాకుండా సభను జరగనివ్వకుండా అడ్డుకోవడం తగదని చెప్పారు.
ఈ సందర్భంగానే కోటంరెడ్డి తనదైన శైలిలో చమత్కరించారు. పోలవరం ప్రాజెక్టు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కు రావాలని కోటంరెడ్డిని కాలువ ఆహ్వానించారు. దీనికి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ `బాహుబలి -2 సినిమాకు ప్రత్యేకంగా వెళ్లక్కర్లేదు. అసెంబ్లీలోనే సభలోనే మీరు చూపిస్తున్నారు కదా``.. అని చమత్కరించారు. `సినిమానే కాదు పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి చూపిస్తాం. తొందర పడవద్దు` అని కాలువ బదులిచ్చారు. అవునవును కాంగ్రెస్ హాయంలో ప్రాజెక్టుకు అడ్డం పడి పనులు సాగకుండా చేసి ఇప్పుడు పోలవరం మేమే పూర్తి చేశామని ఖాతాలోనే వేసుకునే ఘటికులు మీరు అంటూ కోటం రెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా, లాబీలో టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ రావు - బొండా ఉమా - ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు - బుద్ధా వెంకన్న మధ్య ఆర్టీఏ కమిషనర్ సంఘటనపై చిట్‌చాట్ జరిగింది. బాబు అదేశాల మేరకు ట్రాన్సుపోర్టు కమిషనరుకు క్షమాపణ చెప్పానని బుద్దా వెంకన్న అంటే, ఒక ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పడమంటే చిన్న విషయం కాదన్న విప్ చింతమనేని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరున్న టీడీపీలోనే ఇటువంటివి సాధ్యం అని మిగిలిన ఎమ్మెల్యేలు తెలిపారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా అని మీరు ఎదైనా చేస్తారు.. అదే ప్రతిపక్ష నేతలు విషయంలో వెంటనే కేసులు పెడతారని వైకాపా ఎమ్మెల్యేలు వాఖ్యానించగా, తప్ప చేసినప్పుడు క్షమాపణ చెప్పడం సంస్కారం అని అది టీడీపీ నేతలు తిప్పికొట్టారు. ఇదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిరసనపై కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్షమాపణ చేప్పినప్పటికీ ఇంత రాద్ధాంతం చేయడం తగదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/