Begin typing your search above and press return to search.
కరోనా పాజిటివ్ అయినా కొత్తగూడెం డీఎస్పీ డిశ్చార్జ్... ఎలా చేసారంటే ?
By: Tupaki Desk | 11 April 2020 5:15 AM GMTకరోనా వ్యాధిసోకి ఆసుపత్రిలో చేరిన కొత్తగూడెం డీఎస్పీ షేక్ అలీ ఆరోగ్యానికి సంబంధించిన తుది నివేదిక రాకముందే ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చిన కొడుకుతో కలిసి ఊళ్లు తిరగడమేకాకుండా.. స్వతహాగా పోలీస్ అయి ఉండి, క్వారంటైన్ నిబంధనల్ని అతిక్రమించి, సస్పెండైయ్యాడు. అయితే , అయన మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కరోనా తీవ్రత ఇంకా తగ్గకముందే ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
అసలు ఏం జరిగిందంటే ? కొడుకు ద్వారా వైరస్ సోకిన ఆయన, ఇన్నాళ్లూ హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐసోలేషన్ గడువు ముగియడంతో ఆస్పత్రిలో అందరికీ టెస్టులు నిర్వహించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో సదరు డీఎస్పీకి నెగటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. అయితే , ఆస్పత్రి సిబ్బంది లిస్టును రీచెక్ చేసుకోగా.. డీఎస్పీకి ఇంకా వ్యాధి తగ్గలేదని, ఆయన పాజిటివ్ పేషెంట్ అనే ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా డీఎస్పీ పేరుతోనే అదే ఆస్పత్రిలో మరో పేషెంట్ ఉండటంతో ఇద్దరి రిపోర్టులు తారుమారైనట్లు తెలుసుకున్నారు.
దీనితో వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నత అధికారులకి తెలుపగా ..కొత్తగూడెంలోని పోలీసులకు సమాచారం చేరవేశారు. దాంతో స్థానిక పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుకులు పరుగుల మీద డీఎస్పీ ఇంటికి వెళ్లారు. అప్పటికప్పుడు సేఫ్ గార్డ్స్ పెట్టించి, అంబులెన్స్ లో తిరిగి హైదరాబాద్ కు పంపారు. ఈసారి ఆయనను చెస్ట్ ఆస్పత్రికి కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకోక ముందే పొరపాటున డిశ్చార్జ్ అయిన డీఎస్పీ.. ఆస్పత్రి నుంచి బయటికొచ్చినప్పటి నుంచి ఎవరెవర్ని కలిశాడు, ఏ వాహనంలో వెళ్లాడు, మధ్యలో ఏమేం చేశారు, ఇంట్లో ఎవరెవర్ని కలిశారు అనే విషయాల్ని అధికారులు ఆరా తీశారు. ముందు జాగ్రత్తగా వాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచాలని నిర్ణయించారు. అయితే , రిపోర్ట్స్ సరిగ్గా పరిశీలించకుండానే ఆయన్ను ఇంటికి పంపిన అధికారులపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.