Begin typing your search above and press return to search.
బతుకుమ్మ పిలుపులపై తమ్ముళ్ల ఫైర్!
By: Tupaki Desk | 2 Oct 2015 1:18 PM GMTఅధికారంలో ఉన్న వారికి పరిమితులు మామూలే. విపక్షంలో ఉన్న వారికి అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. తెలంగాణ ఉద్యమ సమయంలో విపక్షంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ చెలరేగిపోయేది. ప్రతి విషయాన్ని భావోద్వేగ అంశంగా మలచటంలో సక్సెస్ అయ్యేది. టీఆర్ ఎస్ ఏం మాట్లాడినా అంతలా కనెక్ట్ కావటమేమిటని పలు పార్టీల నేతలు విపరీతంగా అసూయ పడేవారు.
అయితే.. రోజులన్నీ ఒకేలా ఉండవన్న సత్యం టీఆర్ఎస్ కు అమలవుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత వ్యవహరించిన వైనంపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. బతుకమ్మ పండక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిని ఆహ్వానించటంపై వారు గుర్రుగా ఉన్నారు.
బతుకమ్మ పండగను సీమాంధ్రులు అవమానిస్తారంటూ చెప్పిన కవితక్క.. తన మాటకు భిన్నంగా ఇప్పుడు భారతిని ఆహ్వానించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారని.. అలాంటి ఆయన కుటుంబ సభ్యులను బతుకమ్మ కోసం ఎలా ఆహ్వానిస్తారని తెలంగాణ తెలుగుదేశం నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకాలం తాము ఏ సెంటిమెంట్ చూపించి అధికారపక్షాలకు చిరాకు పుట్టించారో.. ఇప్పుడు అదే ప్రయోగాన్ని తమ మీద ప్రయోగించటంపై కవితక్క ఏమంటారో..?