Begin typing your search above and press return to search.
ఏపీ ఎంపీ 53 ఎకరాలు టీ సర్కారు కబ్జానట
By: Tupaki Desk | 13 Sep 2016 4:56 AM GMTఏపీ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో తమకున్న 53 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించిందంటూ ఆరోపణలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించిన ఆమె.. తమ భూమిని రెవెన్యూ అధికారులు లాగేసుకున్నారన్నారు. ఆదివారం తెల్లవారుజామున తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేసిందన్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్త ఎండీ నరసింహారెడ్డి.. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజతకుమార్ సైనీ కలిసి కుట్ర చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ దుర్మార్గానికి పాల్పడినట్లుగా చెబుతున్నఆమె.. భూమికి సంబంధించిన అన్నీ పత్రాలు తమ దగ్గర ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్లుగా వ్యాఖ్యానించారు. తమ జీవితకాలం మొత్తం సంపాదించుకున్న ఆస్తిని సర్కారే ఎలా కబ్జా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అన్యాయంపై గవర్నర్ నరసింహన్.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమకు జరిగిన అన్యాయంపై వారిని కలిసి ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు.
ఈ ఆస్తే తమ జీవితాధారమని.. అది లేని నాడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి ఉంటుందన్న ఆమె.. ఈ ఇష్యూలో న్యాయపోరాటం చేయనున్నట్లుగా వెల్లడించారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరనున్నట్లు కొత్తపల్లి గీత తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే అన్యాయం జరిగిందని చెబుతున్నారో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముందు కలవకుండా.. గవర్నర్.. కేంద్రహోం మంత్రిని కలవటంలో అర్థమేందో కొత్తపల్లి గీతకే తెలియాలి. మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి న్యాయం చేయమని అడగటం ఏమిటో..? ప్రభుత్వం నిజంగానే తప్పు చేసి ఉంటే.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలే కానీ.. ప్రభుత్వం కబ్జా చేసేసందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత తమకు న్యాయం చేయాలని కోరటం ధర్మమేనా..? అన్న ప్రశ్న వినిపిస్తోంది.