Begin typing your search above and press return to search.
మళ్లీ రాజ్ నాథ్ ను కలిసిన అరకు ఎంపీ
By: Tupaki Desk | 23 Sep 2016 9:32 AM GMTఅరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆది నుంచి వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆమె కొద్దికాలంలోనే ఆ పార్టీని వీడారు. ఆ తరువాత కొద్దికాలం కిందట తన భర్తను ఎవరో కిడ్పాప్ చేశారంటూ ఆరోపించి సంచలనానికి తెరతీశారామె. అది ముగిసి ఎంతో కాలం కాకముందే ఇప్పుడు ఆమెకు సంబంధించిన భూముల వ్యవహారం జాతీయ స్థాయిలో ఇష్యూగా మారింది. హైదరాబాద్ లోని తన భూములను తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించుకుందంటూ ఆమె ఆరోపించడడం.. కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ రోజు ఎంపీ కొత్తపల్లి గీత సమావేశమయ్యారు. తెలంగాణలో తాను కొనుగోలు చేసిన భూములను టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆక్రమించిందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొత్తపల్లి గీత ఆ భూములను కొనుగోలు చేయలేదని - ఆమె ఉద్యోగంలో ఉండగా - అక్రమంగా ఆ భూములను కొట్టేశారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని జీహెచ్ ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గీత భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు గీత అక్రమంగా ఆ భూములను కలిగి ఉన్నారంటూ పలు పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. గీత మాత్రం అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఆ భూములు తమవేనని వాదిస్తున్నారు. దీంతో భూవివాదాల్లోకి ఏకంగా కేంద్రాన్ని లాగుతుండడంపై అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.