Begin typing your search above and press return to search.
బాబు దీక్షపై కామెంట్..జంపింగ్ ఎంపీపై ఫైర్
By: Tupaki Desk | 25 April 2018 10:49 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష తాలుకు విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం లేదు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు 12గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష విరమించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పుట్టిన రోజున దీక్ష చేయాల్సి వస్తుందని అనుకోలేదు. అన్ని మతాల వారూ దీక్షా శిబిరానికి వచ్చి ఆశీర్వదించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరూ నినదించారు` అంటూ తెలిపారు. అయితే వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ఈ దీక్షపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనం వృథా అని ఎంపీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార టీడీపీ మండిపడింది. అంతటితో ఆగకుండా..ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.
శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత - రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ గీతపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. గీతకు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎంపీ కొత్తపల్లి గీత తమ పార్టీ సభ్యురాలు కాదని - ఆమె వైఎస్సార్ సీపీ ఎంపీ అని విశ్లేషించారు. ఆమె మాటలను పట్టించుకోనవసరం లేదని ఆయన అన్నారు. మరోవైపు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య పైనా అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో బీసీలకు న్యాయం జరగలేదని ఈశ్వరయ్య వ్యాఖ్యానించడం సరికాదని...అందరికీ న్యాయం చేయడం ఎలా సాద్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీజేపీపై - గవర్నర్ పై కూడా అచ్చెన్న మండిపడ్డారు. బీజేపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు తమపై చేస్తున్న విమర్శలకు విలువే లేదని రోజుకో మాట్లాడే రకమని ఎద్దేవా చేశారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించాలని ఆయన కోరారు.