Begin typing your search above and press return to search.
ఆ జగన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సైతం జంప్?
By: Tupaki Desk | 9 May 2016 4:45 AM GMTజగన్ ను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేలా కనిపించటం లేదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటివరకూ జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేసిన చంద్రబాబు పనిలో పనిగా మరికొందరు బలమైన నేతల మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే జగన్ పార్టీకి చెందిన ఒక జిల్లా అధ్యక్షుడు తాజాగా జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఒకరు తర్వాత ఒకరుగా పలువురు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు సైకిల్ ఎక్కనున్నట్లుగా తెలుస్తోంది.
బాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు తదనంతరం బాబు పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు జంప్ అయ్యారు. తాజాగా చోటు చేసుకున్న పరిస్థితుల్లో తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాల్ని షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. అధినేత మీద తీవ్రఅసంతృప్తితో ఉన్న కొత్తపల్లి.. సైకిల్ ఎక్కుందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు నిర్వహిస్తున్న కొత్తపల్లి.. తన ప్రయత్నంలో సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు.
కొత్తపల్లి రాకకు.. చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయటం.. జగన్ పార్టీకి చెందినబలమైన నేతలు ఎవరైనా సరే పార్టీలోకి వస్తానంటూ వారిని ఆహ్వానించాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. ఇందులో భాగంగానే కొత్తపల్లిని సైకిల్ ఎక్కేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అధికారం ఎటు ఉంటే అటు వెళ్లే కొత్తపల్లి లాంటి వారికి బాబు అవకాశం ఇవ్వటంపై తెలుగు తమ్ముళ్లు కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరుస జంపింగ్స్ తో షాకుల మీద షాకుల తగులుతున్న జగన్ కు కొత్తపల్లి రూపంలో మరో షాక్ తగలనుంది.