Begin typing your search above and press return to search.
ఈ రోజు నుంచే కోటిదీపోత్సవం..పాల్గొంటే కోటి జన్మల ఫలం!
By: Tupaki Desk | 2 Nov 2019 4:25 PM GMTకార్తీక మాసం.. పరమ పవిత్రమైన మాసంగా హిందువులు కొలుస్తారు. ఈనెలలో వత్రాలు - ఉపవాసాలు - పూజలు - కార్తీక దీపోత్సవం లాంటి అనాదిగా వస్తున్న సంప్రదాయాలను ప్రతీరోజు ఆచరిస్తారు. ఆ కోవలోనే ప్రతి ఏటా దీపోత్సవం కూడా నిర్వహిస్తారు. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ దీపోత్సవం ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తుంది.
*భక్తి టీవీ సౌజన్యం..
భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి తన చానెల్ ను భక్తి శ్రద్ధలతో నిర్వహించడమే కాదు.. ఓ మహాయజ్ఞంలో ప్రతీ సంవత్సరం దీపోత్సవం నిర్వహిస్తుంటారు. 2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఇదో ఉద్యమంగా సాగుతోంది. తాజాగా భక్తి టీవీ ఈ సంవత్సరం మహా క్రతువైన కోటి దీపోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 3 అంటే ఈ రోజు నుంచి 18 వరకు ఈ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుసగా ఎనిమిదో సారి భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది.
* హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మరో కైలాసం
కోటి దీపోత్సవం వేదికను కైలాసాన్ని గుర్తు చేసేలా భక్తి టీవీ చానెల్ సెట్ ను సిద్ధం చేసింది. భువిపై కైలాసాన్ని చూసినంతగా ఈ వేదిక అబ్బురపరుస్తోంది. ఎత్తైన హిమగిరులు - జలపాతాలు - యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుడి విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరిసి... కైలసాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలోకి తీసుకొచ్చిన భ్రమను కలిగించేలా సెట్ వేశారు.
*సాంస్కృతిక ప్రదర్శనలు..
కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు. వేద మంత్రాల ఘోషతో జగదుర్గువులు - పీఠాధిపతులు ఇతర పండితులతో ప్రాంగణం ఘోషించనుంది.
*కోటి దీపోత్సవంలో ఎవరెవరు పాల్గొంటున్నారు?
ఈ కోటి దీపోత్సవరంలో పూరి శంకరాచర్య జగద్గురు శ్రీనిశ్చలానంద సరస్వతి - ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థ స్వామీజీ - బాబా రాందేవ్, -శ్రీగణపతి సచ్చిదానంద స్వామి - ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీరవిశంకర్ తోపాటు ప్రసిద్ధ గురువులు - చాగంటి కోటేశ్వరరావు - సామవేదం షణ్ముఖ శర్మ - గరికపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచన కారులు ఈ మహావేడుకలో పాల్గొననున్నారు.
*భక్తులు చేయాల్సిన పని
కోటి దీపోత్సవంలో భక్తులు అందరూ నిష్టగా పాల్గొనవచ్చు. ప్రతీ భక్తుడు శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకాలు - రుద్రాక్షలతో పూజలు - పసుపు కొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. శ్రీవేంకటేశ్వరుడికి ముడుపులు - దుర్గమ్మకు గాజుకు - అమ్మవార్లకు కోటి కుంకుమార్చనలు చేయవచ్చు. గ్రహదోషాలు తొలిగేందుకు రాహుకేతు పూజలు నిర్వహించవచ్చు. ఎన్నో పూజలు పునస్కారాలకు ఈ కోటి దీపోత్సవాన్ని భక్తులు వేదికగా మలుచుకోవచ్చు.
*భక్తులకు ఇచ్చే కానుకలు ఇవీ..
కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ పూజా ద్రవ్యాలు - దేవతామూర్తుల విగ్రహాలు - దీపారాధన నిమిత్తం వత్తులు - నూనె - ప్రమిదలు ఉచితంగా అందిస్తారు. ఎలాంటి రుసుములు - ప్రవేశానికి నిబంధనలు లేవు. ఈ ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలివచ్చి కూర్చుంటే చాలు నిర్వాహకులే సకలం సమకూరుస్తారు. చివరలో ప్రసాదం కూడా అందిస్తారు.
*ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకొచ్చి కన్నులపండువగా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట - మధురై - అన్నవరం - ద్వారకా తిరుమల - సింహాచలం దేవత మూర్తులు కళ్యాణం నిర్వహిస్తారు. అన్ని దేవతలను ఒక్కచోట చూసే భాగ్యాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. వివిధ తీర్థయాత్రలు వెళ్లలేని వారంతా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని ఆ పుణ్యక్షేత్రాల్లో వెలిసిన దేవతలకు మొక్కులు తీర్చుకోవచ్చు. భక్తులు ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడకకు తరలివచ్చి పుణ్య ఫలాన్ని మూటగట్టుకోవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు.