Begin typing your search above and press return to search.
కేంద్ర మాజీ మంత్రి మాట: మాదే అధికారం
By: Tupaki Desk | 5 Jun 2016 10:41 AM GMTకేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత తెరమీదకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు - తమ రాష్ట్రంలోని రాజకీయాల గురించి విశ్లేషించిన కోట్ల అధికార తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అవినీతి తప్ప అభివృద్ధి పట్టడం లేదని కోట్ల ఫైర్ అయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన పథకాలను వారివని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో అక్రమ ప్రాజెక్టులను అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతులకు సాగు నీరు ఇస్తే సంతోషిస్తామని, అలాకాకుండా మాయ మాటలతో మోసం చేయాలనుకోవడం తగదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు - డిండి ప్రాజెక్టులు కడితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని కోట్ల అన్నారు. శ్రీశైలంలో 845 అడుగుల్లో నీరు ఉంటేనే తెలుగుగంగ - హంద్రీనీవా వంటి రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు నీరు వస్తుందని చెప్పారు. తెలంగాణలో 802 - 820 అడుగులలోనే ఆ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి సాగునీరు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోట్ల ఆరోపించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని పేర్కొంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యురాలు కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు పొలీసులతో కుమ్మకై ఇతర పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ తెదేపాలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.