Begin typing your search above and press return to search.
వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ
By: Tupaki Desk | 11 July 2017 8:02 AM GMTవైసీపీలోకి మరో ప్రముఖ రాజకీయ కుటుంబం రానుందని తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మంచి ప్రజాదరణ ఉన్న ఆ కుటుంబం కనుక వైసీపీలో చేరితో వచ్చే ఎన్నికల్లో కర్నూలుతో పాటు వారికి బంధుత్వాలున్న పొరుగు జిల్లాల్లోనూ అది వైసీపీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు - మాజీ మంత్రి అయితన కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్ లేదని భావిస్తున్న ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మారాలని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం.
ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కోట్ల కుటుంబానికి డోన్ - ఆలూరు - పత్తికొండ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినా, కోట్ల సూర్యప్రకాశరెడ్డి - ఆ పార్టీని వీడకుండా ఉన్నారు. ఇప్పుడు తన రాజకీయ వారసుడిగా కుమారుడిని నిలపాలని భావిస్తున్న ఆయనకు కార్యకర్తల నుంచి వైకాపాలోకి చేరాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలోకి వస్తే ఆయనకు మంచి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఘనంగా పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ కూడా నిర్ణయించినట్టు సమాచారం. కోట్ల కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన సతీమణి సుజాతమ్మ - తనయుడు రాఘవేంద్రరెడ్డిలతో కలసి వైసీపీలో చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.