Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను షేక్ చేస్తున్న ఆడియో లీక్

By:  Tupaki Desk   |   12 July 2021 7:42 AM GMT
కాంగ్రెస్ ను షేక్ చేస్తున్న ఆడియో లీక్
X
అనుకున్నట్టే అయ్యింది. అధికార పార్టీ ఎత్తులకు కాంగ్రెస్ చిత్తైంది. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ వశం కాబోతున్నారు. హుజూరాబాద్ లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటలకు గట్టి పోటీనిచ్చిన గత ఎన్నికల్లో తృటిలో ఓడిపోయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడం ఖాయమైపోయింది. ఆయన ఓ టీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు టీఆర్ఎస్ కాదని బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. మరోవైపు టీఆర్ఎస్ మంత్రులు హుజూరాబాద్ పై దండయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడం మైనస్ గా మారింది. ఈటల పోవడంతో ఆయనను ఢీకొట్టే నేత కోసం టీఆర్ఎస్ వెతుకుతోంది.

ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ కన్నుపడింది. ఇటీవలే ఓ కార్యక్రమంలోనే కేటీఆర్ ను కలిసి చర్చించిన కౌశిక్ రెడ్డి తాజాగా ఓ టీఆర్ఎస్ కార్యకర్తతో ఉన్న విషయం చెప్పేశాడు. దీంతో ఆ ఆడియో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరడం కాయమైపోయింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లోనే ఉన్న టీఆర్ఎస్ నుంచే పోటీచేయబోతున్నట్టు ప్రకటించుకోవడం విశేషం.

తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెబుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. సోషల్ మీడియా, మీడియాలో వైరల్ అవుతోంది. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని.. గ్రామ యువతను పోగు చేసి ప్రచారం చేస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని హామీ ఇచ్చాడు.

ఇటీవలే ఆ కార్యకర్త ఈటల వర్గంలో చేరినట్లు తెలుస్తోంది. తిరిగి వారిని టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి తనకు మద్దతు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి చేసిన ఈ ప్లాన్ విఫలమైంది. వాళ్లు ఆడియో లీక్ కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అని కాంగ్రెస్ సీరియస్ అయ్యింది.

కాంగ్రెస్ లోనే ఉంటూ రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ టికెట్ అని మాట్లాడిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఆయన శిష్యుడిగా కౌశిక్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ టీఆర్ఎస్ లోకి వెళుతుండడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు.

టిఆర్ఎస్ టికెట్ నాకే అంటూ ఫోన్ కాల్ లీక్ కావడంతో కాంగ్రెస్ నోటీసులు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డి ఇక తెరచాటు రాజకీయాలకు తెరదించి టీఆర్ఎస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.