Begin typing your search above and press return to search.
జీవితలాగా వారానికోసారి కోర్టు మెట్లు ఎక్కం
By: Tupaki Desk | 6 Feb 2019 10:29 AM GMTపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి తన మరిది గుణశేఖర్ పై దాడి చేశాడని ప్రముఖ సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గుణశేఖరే తమపై దాడి చేసి తన డ్రైవర్ ను తక్కువ కులం వాడంటూ తిట్టాడని.. తనపై దాడి చేశాడని కౌశిక్ రెడ్డి ఈరోజు పోలీసులకు తిరిగి కౌంటర్ ఫిర్యాదు చేశాడు.
గుణశేఖర్ అసలు ఎవరో తనకు తెలియదని.. మా పాప ఏడుస్తుంటే వాటర్ బాటిల్ కోసం ఆయన జ్యూవెల్లరీ షాపు ముందు కారు ఆపితే తమపై దుర్భాషలాడుతూ దాడి చేశాడని కౌశిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్ పై మండిపడ్డారు.
అదో చిన్న గొడవ అని తాము గొడవపడి తోసుకున్నామని.. అక్కడితో ఆ విషయం ముగిస్తే .. జీవిత మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి పెద్దది చేసిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రోడ్ల వెంట ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా రచ్చ చేయడం జీవితకు అలవాటంటూ మండిపడ్డారు. జీవిత రాజశేఖర్ లాగా వారానోకోసారి కోర్టు మెట్లు ఎక్కేవాళ్లం కాదంటూ ఎద్దేవా చేశారు.. గుణశేఖర్ అస్సలు జీవిత మరిది అన్న విషయం కూడా తనకు తెలియదని.. పాపకు నీల్ల కోసం వాహనం పార్క్ చేస్తే రచ్చ చేశాడని చెప్పుకొచ్చారు. తనపై , తన డ్రైవర్ దళితుడిపై దాడి, తిట్టినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్టు కౌశిక్ రెడ్డి మీడియాకు తెలిపారు.