Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ : చైనా ల్యాబ్ నుండే కొవిడ్-19 లీక్ !
By: Tupaki Desk | 20 Feb 2020 7:15 AM GMTకోవిడ్ 19 ( కరోనా వైరస్ ) ప్రస్తుతం ప్రపంచ దేశాలని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల ఇప్పటికే రెండు వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే 80 వేలమంది ఈ వైరస్ భారిన పడి బాధపడుతున్నారు. వారిలో 95 శాతానికిపైగా చైనా వారే ఉన్నారు. అలాగే మృతుల్లో కూడా ఎక్కువ శాతం మంది చైనావారే. అయితే , ప్రస్తుతం చైనా తో పాటుగా ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కోవిడ్ 19 వైరస్ మూలాలు చైనాలోని ఒక ప్రయోగశాలలో ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం అవుతోన్న ఈ సమయంలో సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఆ అనుమానం నిజమే అని చెప్తున్నారు. ‘ద పాజిబుల్ ఆరిజన్స్ ఆఫ్ 2019-ఎన్‌సీవోవీ కరోనా వైరస్’ పేరుతో వారు ఒక వ్యాసం రాశారు.
దాని ప్రకారం.. చైనాలోని ‘వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లో గబ్బిలాలపై కొంత కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ కు కేంద్రస్థానంగా భావిస్తున్న వూహాన్ లోని సీఫుడ్ మార్కెట్ కు కేవలం 300 గజాల దూరంలో ఉందీ పరిశోధన కేంద్రం. ఒకరోజు ఆ కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడి పై దాడి చేశాయని.. వాటి రక్తం అతడి చర్మం పై పడిందని, వాటి మూత్రం కూడా అతడిపై పడిందని వర్సిటీ నిపుణులు తమ పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఆ పరిశోధకుడు రెండువారాలపాటు స్వయం గా క్వారంటైన్ లో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే ఆ ల్యాబ్ నుండే ఈ వైరస్ వ్యాప్తిచెందినట్టుగా అనుమానిస్తుండగా.. ఇప్పుడు దీనికి మరింత బలం చేకూరినట్టు అయ్యింది.
ఇకపోతే , వూహాన్ నుంచి మన దేశానికి తరలించి ఐటీబీపీ క్వారంటైన్ లో ఉంచిన భారతీయులందరినీ, కరోనా పరీక్షలు పూర్తి చేసి , ఎవరికీ ఈ వైరస్ లేదు అని నిర్దారించుకొని , వారిని బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, 2022 తొలినాళ్ల నాటికి కొవిడ్-19 వైరస్ కు టీకా సిద్ధం అవుతుందని పుణెలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన లో తెలిపింది. అలాగే అమెరికా కు చెందిన కొడాజెనిక్స్ కంపెనీ తో కలిసి టీకాను సిద్ధం చేశామని.. ప్రస్తుతం దాన్ని జంతువులపై పరీక్షిస్తున్నామని, ఆరు నెలల్లో మానవులపైనా పరీక్షిస్తామని తెలిపింది.