Begin typing your search above and press return to search.
50 వేలకు దిగొచ్చిన కొవిడ్ కేసులు..!
By: Tupaki Desk | 12 Feb 2022 9:32 AM GMTదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కేవలం రోజుల వ్యవధిలోనే కేసులు అంతకంతకు తగ్గుతూ వచ్చాయి. కేంద్రం ఈ రోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేవలం 50,407 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే గతంలో పోల్చితే మరణాలు మాత్రం మరింత పెరిగాయి.
కొత్తగా 807 మంది వైరస్ కారణంగా చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. మరో వైపు కేంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన కేసులతో పోల్చితే కొత్తగా నమోదు అయిన కేసులు సంఖ్య సుమారు 13 శాతం తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే కేవలం వారం రోజుల్లో వైరస్ కేసులు సంఖ్య 25 వేల దిగువకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే వైరస్ కేసుల సంఖ్య లక్షకు దిగువన నమోదు కావడం అనేది వరుసగా ఇది ఆరో రోజు అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తు చేశారు.
కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా దిగొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివిటీ రేటు 3.48 శాతానికి దిగివచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు శుక్రవారం 3.89గా నమోదు అయ్యింది. దీంతో 0.39 శాతం మేర పాజిటివిటీ రేటు తగ్గినట్లు అయ్యింది. కొత్తగా నమోదు అయ్యే కేసులు భారీగా తగ్గడంతో పాజిటివిటీ రేటు కిందికొచ్చిన్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త కేసులతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరిందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే కొవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. తాజాగా 1,36,962 మంది కోలుకున్నారు. దీంతో భారత్ లో కొవిడ్ అడుగు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 4,14,68,120 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు తాజాగా 807 మంది చనిపోయారు. దీంతో కొవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5,07,981గా నమోదు అయ్యింది. మరో వైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భారత్ లో 6,10,443 కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే యాక్టివ్ కేసుల సంఖ్య 1.34 శాతానికి తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు.