Begin typing your search above and press return to search.

మీరు కూడా ఇలా పిసికేయ‌టం ఏంది స్వామి?

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:41 AM GMT
మీరు కూడా ఇలా పిసికేయ‌టం ఏంది స్వామి?
X
కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు విల‌క్ష‌ణ‌మైన బ్రాండింగ్ ఉంటుంది. వారు వారిలా మాట్లాడితేనే బాగుంటుంది. రూటు మార్చితే అస్స‌లు నప్ప‌దు. అలాంటి వారిలో ఒక‌రు అధికార బీజేపీ సీనియ‌ర్ నేత‌.. స్వామి. ప్ర‌తి విష‌యాన్ని విల‌క్ష‌ణ‌మైన కోణంలో చూసే అల‌వాటున్న ఆయ‌న నోటి నుంచి అదే ప‌నిగా ప్ర‌శంస‌లు వ‌చ్చినా అస్స‌లు బాగోదు. ఆ విష‌యాన్ని స్వామి మిస్ అయిన‌ట్లుగా ఉంది తాజా ఎపిసోడ్ చూస్తే.

విష‌యం ఏదైనా.. మిగిలిన వారికి భిన్నంగా మాట్లాడ‌ట‌మే కాదు.. కొత్త కోణాన్ని తెర మీద‌కు తీసుకొస్తారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఆయ‌న నోటి నుంచి పొగ‌డ్త‌లు చాలా అరుదుగా చేస్తుంటారు. విప‌క్షాల‌తో పాటు.. స‌గ‌టు జీవికి విస్మ‌యం క‌లిగించే రీతిలో మోడీ ప‌రివారం రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌టం తెలిసిందే.

రామ్‌ నాథ్ కోవింద్ అభ్య‌ర్థిత్వం మీద తాజాగా సుబ్ర‌మ‌ణ్య స్వామి స్పందించారు. ఆయ‌న‌కున్న అపార‌మైన జ్ఞానమే అత్యున్న‌త ప‌ద‌వికి ఆయ‌న్ను ఎంపిక చేసేలా చేసింద‌ని వ్యాఖ్యానించారు. కోవింద్ కంటే అత్యుత్త‌మైన వ్య‌క్తిని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా తీసుకురాలేర‌న్న ఆయ‌న‌.. భార‌త రాజ్యాంగం గురించి ఆయ‌న‌కు బాగా తెలుస‌న్నారు. కోవింద్‌ కు ఉన్న గుణ‌గ‌ణాల వ‌ల్లే ఆయ‌న్ను ఎంపిక చేశారే కానీ ఆయ‌న ద‌ళితుడ‌న్న కార‌ణంగా ఎంపిక చేసిన‌ట్లుగా తాను అస్స‌లు అనుకోవ‌టం లేద‌న్నారు. రామ్ నాథ్ కోవింద్‌కు ఎంతో అనుభ‌వం ఉంద‌న్నారు.

స్వామిలాంటి వ్య‌క్తి నోరు విప్పితే కొత్త‌గా ఉండే విష‌యాలు చెప్ప‌టం మామూలే. అందుకు భిన్నంగా మోడీ అండ్ కో తీసుకున్న నిర్ణ‌యానికి అదే ప‌నిగా పొగిడేస్తున్న వైనం ఆయ‌న తీరుకు భిన్నంగా అనిపించ‌క మాన‌దు. ఏంటి.. స్వామి కూడా మారిపోతున్నారా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/