Begin typing your search above and press return to search.
ఈసారి ఇద్దరు చంద్రుళ్లకు మొట్టికాయ పడింది
By: Tupaki Desk | 12 Aug 2016 5:23 AM GMTఒకరికొకరు ఏ మాత్రం తీసిపోరని రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లకు మొట్టికాయలు పడిన వైనమిది. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా తమకు తోచినట్లుగా వ్యవహరించటంపై కృష్ణాబోర్డు ఘాటుగా లేఖ రాయటం ఇప్పుడు చర్చగా మారింది. నిత్యం రూల్స్ గురించి మాట్లాడే ఇద్దరు చంద్రుళ్లు.. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే తమకు తోచినట్లుగా నీటిని విడుదల చేయటంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు ఆదేశాలు జారీ చేయకున్నా ఏపీ.. తెలంగాణలు తమకుతోచినట్లు నీటిని ఎలా విడుదల చేసి వాడుకుంటారని ప్రశ్నించిన బోర్డు.. జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద తీసుకున్న నిర్ణయానికి.. అమలు జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని మండిపడటం గమనార్హం.
2015లో ఢిల్లీలో జరిగిన జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద జరిగిన మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల్ని రెండు తెలుగురాష్ట్రాలు పాటించటం లేదని.. ఆగస్టు 5 తేదీ నుంచి ఏపీ సర్కారు హంద్రీనీవా కాలువకు నీళ్లను తీసుకుంటున్నారని.. అదే సమయంలో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుంటున్నట్లుగా బోర్డు వెల్లడించింది. ఏపీకి తోడు అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తుందని పేర్కొంది. కోయిల్ సాగర్.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు లేఖ రాశారని.. రోజువారీ వివరాల్ని చూస్తే జురాల నుంచి అనేక ప్రాజెక్టులకు నీళ్లు తీసుకుంటున్నారని.. ఇలా తీసుకుంటున్న వాటిల్లో కోయిల్ సాగర్.. నెట్టెంపాడు.. భీమా.. జూరాల కాలువలు ఉన్నట్లుగా కృష్ణా బోర్డు పేర్కొంది.
ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లుగా ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు వ్యవహరించకూడదని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. అధికారికంగా తీసుకున్న నిర్ణయాలకు ఇరురాష్ట్రాలు కట్టుబడి ఉండాలని.. అలా కాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ బోర్డును ఇబ్బందుల్లో పెట్టొద్దని కోరుతున్నట్లుగా బోర్డు వెల్లడించింది. తాజాగా రాసిన లేఖను చూస్తే.. రెండు రాష్ట్రాలు చెప్పే మాటలకు.. చేసే చేతలకు ఏమాత్రం సంబంధం కనిపించని పరిస్థితి. అయినా.. ఇలా చెప్పించుకోవటం ఏమిటి చంద్రుళ్లు..?