Begin typing your search above and press return to search.
ఆ టీడీపీ ముఖ్య నేత ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడతాడా!
By: Tupaki Desk | 29 April 2019 2:30 PM GMTచంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి ఆయన. భారీ ఎత్తున కమిషన్ల శాఖా మంత్రిగా పేరు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోయడంలో ఆయన ఆరితేరిన వ్యక్తి. 'రాసి పెట్టుకో జగన్..' అంటూ ఏకవచనంలో మాట్లాడుతూ అనునిత్యం జగన్ మీద దుమ్మెత్తి పోస్తూ వచ్చారు.
తమ పార్టీ ప్రభుత్వం అద్భుతాలు సాధిస్తుందంటూ ప్రకటించుకొంటూ వచ్చారు. ఉత్తుత్తి సవాళ్లు - ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన ఆయన కృష్ణా జిల్లాకు చెందిన నేత. తెలుగుదేశం పార్టీని బాగా ఓన్ చేసుకునే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆయన. ఇక ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక ధీటైన ప్రత్యర్థిని బరిలోకి దింపింది. ఆ విషయం ఎన్నికలకు ముందే స్పష్టం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ చార్జిపై సదరు మంత్రిగారు అనేక రకాలుగా దాడులు చేయించారు.
ఎంతగా అంటే.. పోలీసుల చేతే తప్పుడు ఫిర్యాదులు చేయించి, వారి చేతే తప్పుడు కేసులు పెట్టించేంత స్థాయిలో రాజకీయం చేశారు. అలాంటి వ్యూహాలు ఎదురుతన్నాయి. అలాంటి పని ఆయనపై వ్యతిరేకతను పెంచింది. ప్రత్యర్థి పై సానుభూతి కూడా పెంచింది.
ఆ సంగతలా ఉంచితే.. నియోజకవర్గంలో ఆయన అనుచరుల దందాలు కూడా గట్టిగా ఉన్నాయి. అనేక వ్యవహారాల్లో వాళ్లు వేళ్లు పెడుతూ వచ్చారు. తీవ్రమైన వ్యతిరేకతను పెంచారు. రాష్ట్ర స్థాయిలో మంత్రిగారి అవినీతి దందా - నియోజకవర్గం స్థాయిలో అనుచరుల దందాలు. వీటి ఫలితంగా ఆయనపై సొంత నియోజకవర్గంలో భారీగా వ్యతిరేకత పెరిగింది. ఇదంతా ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
ఆ మంత్రికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని - అది కూడా ఏకంగా ఇరవై వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ప్రబుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంలో ముందుండేది మంత్రులే. కాబట్టి ఆ మంత్రి ఆ రేంజ్ ఓట్ల తేడాతో ఓడిపోయినా ఓడిపోవచ్చేమో!